నచ్చిందంటే దూకేయడమే..చైతన్య ప్రయాణమలా!
`తండేల్` తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన అక్కినేని వారసుడు నాగచైతన్య పుల్ జోష్ లో ఉన్నాడు.
By: Srikanth Kontham | 5 Sept 2025 3:00 PM IST`తండేల్` తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన అక్కినేని వారసుడు నాగచైతన్య పుల్ జోష్ లో ఉన్నాడు. అక్కినేని కాంపౌండ్ లో తొలిసారి వందకోట్ల క్లబ్ లో చేరింది చైతన్య చిత్రమే. ఈవిషయంలో అక్కినేని కుటుంబం సహా అభిమానలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. చైతన్య కూడా ఆ సక్సస్ ని కంటున్యూ చేసేలా ప్రణాళికలు సిద్దం చేసుకుని ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టికల్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. చైతన్య కెరీర్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రమిది. మిస్టికల్ థ్రిల్లర్ ని భారీ బడ్జెట్ తో రూపొందించడంతో? అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.
వేగంతోనే తప్పులన్నీ:
`విరూపాక్ష` తర్వాత కార్తీక్ తెరకెక్కిస్తోన్న మరో థ్రిల్లర్ సినిమా కావడం, చైతన్య స్టైలిష్ లుక్ సహా ప్రతీది సినిమా అంచనాలు ఆకాశాన్నంటేలా చేస్తున్నాయి. తదుపరి లైనప్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. శివ నిర్వాణ సహా పలువురు ట్యాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలు చేసేలా సిద్దమవు తున్నాడు. తాజాగా చైతన్య కెరీర్ ఆరంభంలో ఎలా ఉండేవారు? ఎలా ఆలోచించే వారు? వంటి విషయాలు పంచుకున్నారు. అప్పట్లో ఎలాంటి భయలు ఉండేవి కావు. కేర్ ఫ్రీ మనస్తత్వంతో ఉండేవాడిని.
ప్లాప్ లతో కష్టంగానే:
నచ్చిదంటే దూకేయడమే? అలా ఉండటం కూడా చాలా సందర్భాల్లో మంచిదే అయిందన్నారు. ఆ స్పీడ్ వల్లే చేసిన తప్పులను వెంటనే తెలుసుకునే వాడినన్నారు. వాటి నుంచి ఎక్కువ విషయాలు నేర్చుకో వడానికి అవకాశం ఉంటుందన్నారు. కానీ ఆరంభంలో పరాజయాలతో ఇబ్బందిగానే ఉండేదని, ఆస్టేజ్ దాటి వచ్చే వరకూ ఏదో బరువు వెనక్కి లాగుతున్న ఫీలింగ్ కలిగేదన్నారు. పరిణతి చెందిన తర్వాత తప్పు ఎక్కడా జరిగిందో సీరియస్ గా ఆలోచించడం ఎక్కువైందన్నారు. అలా చేసినప్పుడు తప్పులు పట్టు కోగలమన్నారు.
నాకంటే వాళ్లే బాగా చెప్పగలరు:
తదుపరి అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడగలమన్నారు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన సమ యంలో నాన్న అందించిన సహకారం అంతా ఇంతా కాదన్నారు. సినిమా రిజల్ట్ ని కాకుండా.. ఆ సినిమా అనుభవాన్ని తీసుకుని ముందుకెళ్లాలని చెప్పారు. ఆ మాటలు నాపై చాలా ప్రభావాన్ని చూపించాయి. అదంతా వాళ్ల అనుభవం కాబట్టి చెప్పగలిగారు. వాటిని అనుసరించే కెరీర్ ను ఇంతకాలంగా ముందుకు తీసుకెళ్తున్నానన్నారు. నాలో మార్పుల గురించి నాకంటే ప్రేక్షకులు , విమర్శకులే బాగా చెప్పగలరు. ఇండస్ట్రీలో నేనింకా నేర్చుకోవాల్సింది, సాధించాల్సింది చాలా ఉందన్నారు. మజిలి, లవ్ స్టోరీ లాంటి చిత్రాల్లో నటించిన తర్వాత తన ఆలోచన విధానమే మారిపోయిందన్నారు.
