Begin typing your search above and press return to search.

చైతూ ప్లాన్ మార్చారా? పవర్ స్టార్ డైరెక్టర్‌ తో నెక్స్ట్ నిజమేనా?

ఇప్పుడు అసలు ఆసక్తికర విషయం ఏమిటంటే, చైతన్య 25వ సినిమా ఎవరితో అన్నదే. తొలుత ఆ ప్రాజెక్ట్ శివ నిర్వాణతో ఉంటుందని ప్రచారం జరిగింది.

By:  M Prashanth   |   23 Jan 2026 9:00 PM IST
చైతూ ప్లాన్ మార్చారా? పవర్ స్టార్ డైరెక్టర్‌ తో నెక్స్ట్ నిజమేనా?
X

టాలీవుడ్ యంగ్ హీరో, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం మిస్టిక్ థ్రిల్లర్ వృష కర్మ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌ తో, విభిన్న కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న ఆ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఆా మూవీ విడుదల తేదీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

అయితే తండేల్ మూవీతో బ్లాక్‌ బస్టర్ అందుకున్న నాగచైతన్య మళ్లీ ఫామ్‌ లోకి వచ్చారు. ఆ విజయంతో ఇకపై కొత్త తరహా కథలు, విభిన్న ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పుడు వృషకర్మ సినిమాను ప్లాన్ చేశారని టాక్. ఆ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇప్పుడు అసలు ఆసక్తికర విషయం ఏమిటంటే, చైతన్య 25వ సినిమా ఎవరితో అన్నదే. తొలుత ఆ ప్రాజెక్ట్ శివ నిర్వాణతో ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొరటాల శివ పేరు కూడా వినిపించింది. కానీ ఆ రెండు కాంబినేషన్లు ఫైనల్ కాలేదు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న దర్శకుడు హరీష్ శంకర్‌ తో చైతూ సినిమా చేయబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే హరీష్ శంకర్ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా ఇప్పటికే మంచి పేరు సంపాదించారు. ఆయన గత చిత్రం మిస్టర్ బచ్చన్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, మాస్ కథల్లో మంచి అనుభవం ఉంది. అందుకే ఇప్పుడు నాగచైతన్య కోసం పవర్‌ ఫుల్ మాస్ స్టోరీ సిద్ధం చేసినట్లు సమాచారం. సాధారణంగా లవ్ స్టోరీలు, సాఫ్ట్ రోల్స్‌ తో గుర్తింపు పొందిన చైతన్య.. మాస్ డైరెక్టర్‌ తో జతకట్టడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి చివరి లేదా ఏప్రిల్ ప్రారంభంలో విడుదలయ్యే అవకాశముందని టాక్. ఆ సినిమా తర్వాత హరీష్–చైతన్య కాంబినేషన్‌ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతలో వృష కర్మ కూడా థియేటర్స్ లోకి రానుందని వినికిడి. ఏదేమైనా హరీష్, చైతన్య కాంబోలో భారీ మాస్ హిట్ వస్తుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

కాగా.. ఇప్పటికే కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని మాస్ ప్రయత్నాలు చేసి ఫ్లాప్ ఎదుర్కొన్న నాగచైతన్య… ఆ తర్వాత ప్రేమ కథలు, విభిన్న కథలతో విజయాలు సాధించారు. ఇప్పుడు మళ్లీ మాస్ వైపు అడుగులు వస్తున్నారా అనే ప్రశ్న అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. మరి హరీష్- చైతూ కాంబినేషన్ నిజమవుతుందా? లేక మరో కొత్త సర్ప్రైజ్ రానుందా? అన్నది త్వరలో తేలనుంది.