సక్సెస్ అయితే మరో మెట్టు ఎక్కినట్లే!
ఇండస్ట్రీలో సక్సెస్ అన్నది ఎన్నో రకాల మార్పులకు దారి తీస్తుంది. విజయం వెంట ఉంటే? అవకాశాలు పెరుగుతాయి.
By: Srikanth Kontham | 7 March 2026 9:00 PM ISTఇండస్ట్రీలో సక్సెస్ అన్నది ఎన్నో రకాల మార్పులకు దారి తీస్తుంది. విజయం వెంట ఉంటే? అవకాశాలు పెరుగుతాయి. ఇమేజ్, స్టార్ డమ్ రెట్టింపు అవుతాయి. నటుడిని ప్రేక్షకుడు చూసే కోణం మారుతుంది. ఇండస్ట్రీలో రీచ్ అవ్వాల్సిన గోల్ సమీపంగా చేరుతుంది. నాగచైతన్య, విజయ్ దేవరకొండ, సాయితేజ్ ఇప్పటికే కొంత సక్సెస్ ను చూసేసారు. చై మాత్రం మిగతా ఇద్దరు హీరోలకంటే చాలా ముందంజలో ఉన్నాడు. అతడు చేరుకోవాల్సింది స్టార్ లీగ్ లోనే. `తండేల్` తో 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టేసాడు. ఇకపై చైతన్య సాధించాల్సింది 200 కోట్లు..500 కోట్లు..1000 కోట్ల క్లబ్ లో చేరడమే.
ఆ రకమైన ప్రయత్నాలు చై ఇప్పటికే మొదలు పెట్టేసాడు. ప్రస్తుతం `విరూపాక్ష` ఫేం కార్తీక్ దండుతో `వృశకర్మ` అనే మిస్టిక్ థ్రిల్లర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఈ సినిమా విజయంతో చైతన్య నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కినట్లే. ప్రయోగాల విషయంలో చైతన్య ఎంత మాత్రం వెనుకాడడు. పాత్రలకు తగ్గట్టు మౌల్డ్ అవుతాడు. ఆ పాత్రలో ఎంత కష్టమున్నా? పడతాడు. అదే అతడి గొప్పతనం. ఈ `వృశకర్మ` సక్సెస్ ను దృష్టిలోపెట్టుకుని తదుపరి చిత్రాల ప్రణాళిక కూడా సిద్దం చేసుకుంటున్నాడు.
ఎలాంటి డైరెక్టర్లతో తన స్టార్ డమ్ రెట్టింపు అవుతుందో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఎంపిక చేస్తున్నాడు. స్టోరీల పరంగా తానెంత స్ట్రాంగ్ గా ఉన్నాడు? అన్న దానిపై అంతే సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. మెగా మేనల్లుడు సాయితేజ్ కూడా కెరీర్ ని అంతే స్ట్రాంగ్ గా బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. `విరూపాక్ష`తో గ్రాండ్ విక్టరీని నమోదు చేసినా? `బ్రో` తో మళ్లీ ప్లాప్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం విజయం కోసం చూస్తున్నాడు. అతడు హీరోగా రోహిత్ కె.పి దర్శకత్వంలో `సంబరాల ఏటిగట్టు` అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విజువల్ గా కథను హైలైట్ చేస్తున్నారు. సినిమా హిట్ అయితే? సాయితేజ్ బౌన్స్ బ్యాక్ అవుతాడు. అలాగే విజయ్ దేవరకొండ కూడా కొంత కాలంగా వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. చేస్తున్న సినిమాలేవి ఆశీంచిన ఫలితాలు రావడం లేదు. సరిగ్గా ఫాంలో ఉన్న సమయంలోనే వరుస పరాజయాల పరంపర మొదలైంది. అప్పటి నుంచి బ్లాక్ బస్టర్ పడలేదు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో `రణ బాలి` లో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. విజయ్ మేకోవర్ ఆకట్టుకుంటుంది. ఈ విజయం దేవరకొండకు అత్యంత కీలకమైంది.
