Begin typing your search above and press return to search.

సాయి పల్లవితో మరో మహానటి..?

కల్కి 2898 AD సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి 2 కోసం పని చేస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   4 Oct 2025 12:01 PM IST
సాయి పల్లవితో మరో మహానటి..?
X

కల్కి 2898 AD సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి 2 కోసం పని చేస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో కల్కి 2 మరింత భారీ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఐతే కల్కి 2898 AD సినిమా తర్వాత నాగ్ అశ్విన్ పార్ట్ 2 కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసినా ప్రభాస్ డేట్స్ కోసం కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రభాస్ ఏమో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అసలైతే కల్కి 2 ఈ ఇయర్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది ఇంకా సెట్స్ మీదకే వెళ్లలేదు.

నాగ్ అశ్విన్ కల్కి 2 కి బ్రేక్..

ఐతే ప్రభాస్ డేట్స్ ఇప్పుడప్పుడే కష్టమని ఫిక్స్ అయిన నాగ్ అశ్విన్ కల్కి 2 కి బ్రేక్ ఇచ్చి మరో సినిమా చేయబోతున్నాడట. అది కూడ సూపర్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని టాక్. నాగ్ అశ్విన్ తన నెక్స్ట్ సినిమాను సాయి పల్లవితో చేస్తారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. తను ఎంచుకున్న పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేస్తుంది సాయి పల్లవి. అలాంటి యాక్ట్రెస్ తో నాగ్ అశ్విన్ సినిమా అంటే ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఏర్పడింది.

అంతేకాదు నాగ్ అశ్విన్ కల్కి కి ముందు మహానటి సినిమా చేశాడు. మహానటి సావిత్రి జీవిత కథతో ఈ సినిమా వచ్చింది. కీర్తి సురేష్ లీడ్ రోల్ లో వచ్చిన మహానటి సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డ్ వచ్చింది. సో ఇప్పుడు సాయి పల్లవితో నాగ్ అశ్విన్ మరో ఫిమేల్ సెంట్రిక్ సినిమా అనగానే సాయి పల్లవితో కూడా నాగ్ అశ్విన్ మహానటి రేంజ్ సినిమా చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

మహానటితో సూపర్ హిట్..

నాగ్ అశ్విన్ కన్విక్షన్ ఇంప్రెస్ చేస్తుంది. ఎంచుకున్న కథను ఆడియన్స్ మెప్పు పొందేలా అద్భుతమైన విజువల్స్ తో అందిస్తాడు. ఎవడే సుబ్రహ్మణ్యం తో డైరెక్టర్ గా పరిచయమైన నాగ్ అశ్విన్ మహానటితో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక కల్కి 1 తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు. కల్కి 2 పై పనిచేస్తున్నా కూడా ఆ సినిమాకు ఇంకా టైం పట్టేలా ఉందని ఈలోగా సాయి పల్లవితో ఒక సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు నాగ్ అశ్విన్. తప్పకుండా నాగ్ అశ్విన్ ఈ క్రేజీ అటెంప్ట్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు.

సాయి పల్లవి కూడా తండేల్ తర్వాత తెలుగులో ఏ సినిమాకు సైన్ చేయలేదు. బాలీవుడ్ లో ఆమె వరుస సినిమాలు చేస్తుంది. నాగ్ అశ్విన్ సినిమా ఓకే అయితే మాత్రం సాయి పల్లవి ఖాతాలో మరో క్రేజీ మూవీ యాడ్ అయినట్టే లెక్క.