నేనేం చేస్తున్నానో నాకు తెలుసు : నాగ్ అశ్విన్
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి' సినిమాలో కర్ణుడు గురించి గొప్పగా చెప్పారని, పార్ట్ 2 లో సైతం కర్ణుడి పాత్రను హైలైట్ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది.
By: Ramesh Palla | 13 July 2026 12:26 PM ISTప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి' సినిమాలో కర్ణుడు గురించి గొప్పగా చెప్పారని, పార్ట్ 2 లో సైతం కర్ణుడి పాత్రను హైలైట్ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది కర్ణుడి గురించి అంత హైప్ ఇచ్చి చూపించాల్సిన అవసరం లేదని, కర్ణుడు గొప్ప వ్యక్తి కాదంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలోనే అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమాను మహాభారతం కు లింక్ చేసి దర్శకుడు చూపించిన కొన్ని పాత్రల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రమోద్ పంజు పోషించిన పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కర్ణుడి పాత్ర అంటూ అతడిని చూపించిన తీరు బాగుంది. అయితే కర్ణుడు అంటే ఇలా ఉండాలి, అతడి తీరును లెనిన్ సినిమాలో చక్కగా చూపించారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.
లెనిన్ సినిమాలో కర్ణుడి పాత్ర...
లెనిన్ సినిమాలోని కర్ణుడి పాత్ర గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలోని కర్ణుడి పాత్ర గురించి, దర్శకుడు నాగ్ అశ్విన్ ను గురించి విమర్శలు మొదలు అయ్యాయి. కర్ణుడిని గొప్ప వ్యక్తిగా, హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ చూపించి చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కొందరు చేస్తున్న విమర్శలకు నాగ్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేను చేసే దాన్ని గురించి ఎలాంటి అనుమానం అక్కర్లేదు. పార్ట్ 2 కోసం వేచి ఉండండి అంటూ పోస్ట్ చేసి మహాభారతంలోని కొంద భాగంను ఎక్స్ లో పంచుకున్నాడు. అందులో అర్జునుడితో శ్రీ కృష్ణుడు ఒకానొక సందర్భంగా కర్ణుడి గొప్పతనం గురించి వివరిస్తున్నాడు. కర్ణుడి పరాక్రమం, గొప్పతనం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు వివరించాడు అంటూ మహాభారతంను షేర్ చేయడం ద్వారా నాగ్ అశ్విన్ బలంగా సమాధానం ఇచ్చాడు.
దర్శకుడు నాగ్ అశ్విన్...
ఇంకా నాగ్ అశ్విన్ స్పందిస్తూ... ద్రోణ వధ పర్వంలో ఘటోత్కచుడు చనిపోయిన తర్వాత కర్ణుడు గురించి అర్జునుడితో శ్రీకృష్ణుడు కొన్ని విషయాలు చెబుతాడు. ఆ విషయాలను గూగుల్ చేసి అయినా చూసుకోవచ్చు. ఎన్నో సార్లు శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడితో కర్ణుడు గురించి మాట్లాడటం జరుగుతుంది. అందులో ఎక్కువగా కర్ణుడిపై ప్రశంసలు కురిపించడం ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. కర్ణుడి గొప్పతనం శ్రీకృష్ణుడు చెప్పాడని, అది అర్జునిడితో అంటూ నాగ్ అశ్విన్ సాక్ష్యంతో సహా చూపించడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు తెర దించినట్లు అయింది. నాగ్ అశ్విన్ తాజా రియాక్షన్‌తో కల్కి 2 సినిమాలో కర్ణుడి గురించి చాలా బలంగానే చెప్పబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. దాంతో నాగ్ అశ్విన్ అసలు కల్కి 2 లో ఏం చూపిస్తాడు అనే ఆసక్తి పెరిగి పోతుంది.
కల్కి 2 సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్..
ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు పార్ట్ 2ని మొదలు పెట్టేందుకు గాను దర్శకుడు నాగ్ అశ్విన్ సిద్ధం అవుతున్నాడు. పార్ట్ 2 లో దీపికా పదుకునే ఉండక పోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. ఆమెపై ఇప్పటికే షూట్ చేసిన సీన్స్ విషయమై నాగ్ అశ్విన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. నాగ్ అశ్విన్ మొన్నటి వరకు సింగ్ గీతం సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కల్కి 2 విషయమై శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కి 2 విషయమై చాలా నమ్కంతో ఉన్నాడు. అందుకే భారీగా ఖర్చు చేసి సినిమాను రూపొందించేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి.
