'డెకాయిట్' మృణాల్.. నాగ్ అశ్విన్ సలహా వెనుక రీజనేంటి?
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, బీటౌన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య ఉన్న అనుబంధం స్పెషల్ అనే చెప్పాలి.
By: M Prashanth | 13 April 2026 2:35 PM ISTటాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, బీటౌన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య ఉన్న అనుబంధం స్పెషల్ అనే చెప్పాలి. సీతారామం సినిమా ద్వారా ఆ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. నాగవంశీ హోం బ్యాన్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై వచ్చిన ఆ చిత్రంతోనే మృణాల్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. అప్పటి నుంచి నాగ్ అశ్విన్ ఆమె టాలెంట్ ను దగ్గరగా గమనిస్తూ వస్తున్నారు.
అంతే కాదు తన మూవీ కల్కి 2898 ఏడీ మూవీలో గెస్ట్ రోల్ ఇచ్చారు. అయితే ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించిన డెకాయిట్ సినిమా సక్సెస్ మీట్ లో నాగ్, మృణాల్ అనుబంధం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగ్ అశ్విన్, మృణాల్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమెను సాధారణ నటిగా కాకుండా, లెజెండరీ స్థాయి నటీమణులతో పోల్చారు.
"మృణాల్ అద్భుతమైన నటి. ఆమెలో ఒక ప్రత్యేకమైన గ్రేస్ ఉంది. గతంలో ప్రేక్షకులను అలరించిన స్మితా పాటిల్, మధుబాల లాంటి నటీమణుల తరహా లక్షణాలు ఆమెలో కనిపిస్తున్నాయి. అలాంటి నటీమణులు చాలా అరుదుగా ఉంటారు" అంటూ నాగ్ అశ్విన్ కొనియాడారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్.. సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
అయితే కేవలం ప్రశంసలతోనే ఆగకుండా మృణాల్ కెరీర్ పై ఒక విలువైన సలహా కూడా ఇచ్చారు. "నువ్వు చాలా గొప్ప స్థాయి ఉన్న నటివి. కాబట్టి చిన్న చిన్న పాత్రలు లేదా ప్రాధాన్యత లేని క్యారెక్టర్లు చేసి నీ స్థాయిని తగ్గించుకోవద్దు. ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప పాత్రలను మాత్రమే ఎంచుకోవాలి" అని సూచించారు. ఒక స్టార్ డైరెక్టర్ ఈ విధంగా ఓ హీరోయిన్ భవిష్యత్తుపై శ్రద్ధ చూపడం విశేషం.
ప్రస్తుతం మృణాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సీతారామం తర్వాత కథల ఎంపికలో ఆమె జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. హాయ్ నాన్న వంటి సినిమాలతో కూడా ఆమె తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా డెకాయిట్ చిత్రంలో అడివి శేష్ సరసన నటించి మరో విజయాన్ని అందుకున్నారు. మృణాల్ భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలను ఎంచుకుంటే, ఆమె కెరీర్ మరో స్థాయికి చేరుతుందని చెప్పాలి.
అయితే నాగ్ అశ్విన్- మృణాల్ ఠాకూర్ అనుబంధం నుంచి వచ్చిన ఆ సజెషన్.. ఆమె కెరీర్ కు కొత్త దిశను చూపించనుందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతోంది. అదే సమయంలో టాలీవుడ్ లోకి వచ్చి నుంచి మృణాల్ ఠాకూర్ టాలెంట్ ను గమనిస్తున్నారు కాబట్టే.. అంత మంచిగా కేర్ తీసుకుని నాగ్ అశ్విన్ సలహా ఇచ్చినట్లు ఉన్నారని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.
