సినిమా టికెట్ పై జీఎస్టీ.. నాగ్ అశ్విన్ రిక్వెస్ట్..!
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణల్లో భాగంగా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం 100 లోపు టికెట్ ఉన్న సినిమా టికెట్ల పై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది.
By: Ramesh Boddu | 6 Sept 2025 12:37 PM ISTకేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణల్లో భాగంగా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం 100 లోపు టికెట్ ఉన్న సినిమా టికెట్ల పై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఐతే 100 కంటే ఎక్కువ ఉన్న థియేటర్ల టికెట్లపై మాత్రం అంతకుముందు ఉన్న 18 శాతం జీఎస్టీ కొనసాగించాలని చెప్పింది. ఐతే ఈ విషయంపై తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియాలో ప్రధాని మోడీకి రిక్వెస్ట్ చేస్తూ ఒక కామెంట్ పెట్టారు నాగ్ అశ్విన్.
100 లోపు టికెట్లకే 5 శాతం జీఎస్టీ..
జీఎస్టీ సంస్కరణలు స్వాగతించిన నాగ్ అశ్విన్ 100 లోపు టికెట్లకే 5 శాతం జీఎస్టీ కాకుండా 250 రూపాయల వరకు అది పొడిగిస్తే బాగుంటుందని సినీ పరిశ్రమ, థియేటర్లు అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. మిడిల్ క్లాస్ ఆడియన్స్ ని ఆకర్షించడానికి ఇది ఎంతో అవసరం అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు నాగ్ అశ్విన్.
అంటే నాగ్ అశ్విన్ చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఎలా అయితే 100 లోపు టికెట్ ప్రైజ్ ఉన్న వాటికి 5 శాతం జీఎస్టీ అంటున్నారో అలానే దాన్ని 250 టికెట్ రేట్ వరకు పొడిగిస్తే బాగుంటుందని అంటున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 100 లోపు టికెట్ ప్రైజ్ ఉన్న వాటికే 12 శాతం నుంచి 5 శాతం జీఎస్టీ కుదించింది. నాగ్ అశ్విన్ చేసిన రిక్వెస్ట్ ని నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు.
నాగ్ అశ్విన్ చేసిన రిక్వెస్ట్..
ఈమధ్య కాలంలో టికెట్ రేట్లు ఎక్కువ అవ్వడం వల్లే ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేశారు. జిఎస్టీ తగ్గించడంతో టికెట్ రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. దాని వల్ల ఎక్కువమంది ఆడియన్స్ థియేటర్ కి వచ్చి సినిమా చూసే ఛాన్స్ ఉంటుంది. నాగ్ అశ్విన్ చేసిన రిక్వెస్ట్ ని కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఐతే జీఎస్టీ పర్సెంటేజ్ మార్పులు కొంతలో కొంత పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తాయని చెప్పొచ్చు.
ప్రభాస్ తో కల్కి 2898 AD సినిమా తీసిన నాగ్ అశ్విన్ నెక్స్ట్ ఆ సినిమా సీక్వెల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన చేసిన మహానటి సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో నటించిన లీడ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చిందని తెలిసిందే. నాగ్ అశ్విన్ కల్కి అయితే మాత్రం ఇండియన్ తెర మీద హాలీవుడ్ ఎఫెక్ట్ చూపించేలా చేశాడు. ఐతే కల్కి 2 నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాల బిజీ వల్ల కల్కి 2 కి డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే కల్కి 2 స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.
