తీసింది మూడు సినిమాలే.. నిర్మాతలకు మాత్రం రెట్టింపు లాభం!
నాగ్ అశ్విన్ ప్రయాణం 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే ఒక క్లాసిక్ సినిమాతో మొదలైంది. నాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు దాదాపు 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సుమారు 6 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.
By: Madhu Reddy | 7 Feb 2026 5:00 AM ISTసినిమాలు తీయటం ఓ సాహసమనే చెప్పాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు అనేది చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే సాధ్యపడే విషయం. కొందరు డజన్ల కొద్దీ సినిమాలు తీసినా రాని గుర్తింపు, మరికొందరు తీసిన రెండు మూడు సినిమాలతోనే సాధిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన తీసినవి కేవలం మూడు సినిమాలే అయినా, బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మాత్రం మామూలుది కాదు. ఆయన విజన్ మరియు నిర్మాతలకు చేకూర్చిన లాభాల గురించి ఇప్పుడు ఓ లుక్ వేద్దాం..
చిన్న సినిమాతో మొదలైన పెద్ద విజయం:
నాగ్ అశ్విన్ ప్రయాణం 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే ఒక క్లాసిక్ సినిమాతో మొదలైంది. నాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు దాదాపు 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సుమారు 6 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం రావడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఒక కొత్త దర్శకుడు ఫిలాసఫీతో కూడిన సినిమాను తీసి కమర్షియల్‌గా సక్సెస్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతోనే నాగ్ అశ్విన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు.
మహానటితో ప్రపంచ స్థాయి గుర్తింపు:
మొదటి సినిమాతోనే సత్తా చాటిన నాగ్ అశ్విన్, తన రెండో ప్రయత్నంగా అలనాటి నటి సావిత్రి గారి జీవిత కథను 'మహానటి'గా తెరకెక్కించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ బయోపిక్‌ను సుమారు 25 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఒక బయోపిక్ మీద అంత ఖర్చు చేయడం అప్పట్లో సాహసమే అనుకున్నా,ఇక ఈ సినిమా ఏకంగా 80 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కేవలం డబ్బులు మాత్రమే కాదు, జాతీయ పురస్కారాలను కూడా తెచ్చిపెట్టి నాగ్ అశ్విన్ పేరును భారతీయ సినిమా స్టేజ్ పైన సుస్థిరం చేసింది.
కల్కితో గ్లోబల్ బాక్సాఫీస్ షేక్:
ఇక మూడవ సినిమాగా ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 AD' గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా సుమారు 600 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను రూపొందించారు. ఇక నాగ్ అశ్విన్ విజన్ మీద నమ్మకంతో నిర్మాతలు పెట్టిన ఈ పెట్టుబడికి ప్రతిఫలంగా, సినిమా ఏకంగా 1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మూడు సినిమాలు.. మూడు విభిన్న జోనర్లు.. కానీ ప్రతిసారీ నిర్మాతలకు లాభాల పంట పండించడం నాగ్ అశ్విన్ ప్రత్యేకత. తక్కువ సినిమాలతో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న దర్శకుడిగా ఆయన ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్‌గా ఎదిగారు.
