కింగ్ సెంచరీలో కీర్తి సురేష్!
కానీ నాయిక ఎంపిక ఫైనల్ కాకపోవడంతో కార్యక్రమంలో గ్లామర్ కనిపించలేదు. మరి హీరోయిన్ ఛాన్స్ ఎవరికి ఇస్తున్నారు? అంటే మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ పేరు తెరపైకి వచ్చింది.
By: Srikanth Kontham | 7 Oct 2025 12:21 PM ISTకింగ్ నాగార్జున 100వ చిత్రం రా. కార్తిక్ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నాగార్జున వందవ సినిమా కావడంతో బయట నిర్మాణ సంస్థలు వేటికి అవకాశం ఇవ్వకుండా తానే స్వయంగా నిర్మించాలని నాగార్జున ముందే డిసైడ్ అయ్యారు. అనుకు న్నట్లే ప్రాజెక్ట్ గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు? అన్నది ఫైనల్ కాలేదు. సాధారణంగా లాంచింగ్ రోజునే హీరోయిన్ కూడా ఈవెంట్ లో పాల్గొని దేవుడి పటాల ముందు కొబ్బరి కాయ కొడతారు.
ఆమెకు టచ్ లో డైరెక్టర్:
కానీ నాయిక ఎంపిక ఫైనల్ కాకపోవడంతో కార్యక్రమంలో గ్లామర్ కనిపించలేదు. మరి హీరోయిన్ ఛాన్స్ ఎవరికి ఇస్తున్నారు? అంటే మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ పేరు తెరపైకి వచ్చింది. మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారుట. హీరోయిన్ ఎంపిక విషయంలో నాగ్ ఇన్వాల్వ్ అయినట్లు చెబుతున్నారు. ఆయన ఆదేశాలతో పాటు పాత్రకు కూడా పర్పెక్ట్ గా సూటువుతుందని కార్తీక్ భావించడంతో కీర్తికి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నాగ్ సరసన పర్పెక్ట్ జోడీ అవుతుంది. అమ్మడు వయసు ఇప్పటికే 33 సంవత్సరాలు.
మన్మధుడు2 అనంతరం మరోసారి:
సీనియర్ హీరోలతో పని చేసిన అనుభవం ఉంది. `భోళాశంకర్` లో చిరంజీవికి సోదరి పాత్రలో నటించింది. రవితేజ , నాని, మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లకు హీరోయిన్ గా నటించింది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేసింది. ఈ నేపథ్యంలో నాగ్ సరసన అన్ని రకాలుగా పక్కాగా సూటవుతుంది. నాగార్జునతో తెరను పంచుకోవడం కొత్త కాదు. గతంలో నాగార్జున హీరోగా నటించిన `మన్మధుడు 2` లో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చింది. అప్పుడు ఆ ఛాన్స్ కూడా తీసుకుంది నాగార్జునే. ఇప్పుడదే భామను తనకు జోడీగా ఎంపిక వైపు వెళ్లడం విశేషం. కీర్తి ఎంట్రీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
సీనియర్లకు కీర్తి మంచి ఛాయిస్:
ప్రస్తుతం కీర్తి సురేష్ నటిగా బిజీగా ఉంది. పలు తెలుగు, హిందీ ప్రాజెక్ట్ లు చేస్తోంది. తమిళ్ లో `రివాల్వర్ రీటా` అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో కూడా నటిస్తోంది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేస్తోంది. ఇందులో ఓ బోల్డ్ పాత్రలో కనిపించనుంది. పెళ్లికి ముందుకంటే పెళ్లైన తర్వాత అవకాశాలు పెరిగాయి అన్న విషయాన్ని ఈ అమ్మడు కూడా ప్రూవ్ చేస్తోంది. నాగ్ తో సక్సెస్ అందుకుంటే గనుక సీనియర్ హీరోలందరికీ పర్పెక్ట్ ఛాయిస్ అవుతుంది.
