Begin typing your search above and press return to search.

60ల్లో కూడా తగ్గని జోరు..పవన్ కళ్యాణ్ అత్త స్పీడ్ మామూలుగా లేదుగా!

60లో కూడా తగ్గని జోరుతో.. పవన్ కళ్యాణ్ అత్త స్పీడు మామూలుగా లేదుగా అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.

By:  Madhu Reddy   |   11 Oct 2025 7:00 PM IST
60ల్లో కూడా తగ్గని జోరు..పవన్ కళ్యాణ్ అత్త స్పీడ్ మామూలుగా లేదుగా!
X

ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్స్ ఫిట్నెస్ పైన.. అందం పైన ఫోకస్ పెడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే 60 సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా యంగ్ గా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. సాధారణంగా 30 ఏళ్లు దాటాయి అంటే ఆడవారిలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ వీళ్ళని చూస్తే మాత్రం నిజంగా వీళ్లకు 60 సంవత్సరాలా అనే అనుమానాలు కలగకమానవు. అంతేకాదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా తమ అందంతో.. నటనతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఎంతోమంది ఇప్పుడు రీ ఎంట్రీలో కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా 58 ఏళ్ల వయసులో కూడా ఒక నటి జోరు చూపిస్తూ కుర్ర హీరోయిన్లకు భారీ షాక్ తగిలేలా చేసింది. 60లో కూడా తగ్గని జోరుతో.. పవన్ కళ్యాణ్ అత్త స్పీడు మామూలుగా లేదుగా అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ నదియా.. 1966 అక్టోబర్ 24న పరీహిల్ ముంబైలో ఉంది. 1984లో మలయాళ సినిమాలో మోహన్ లాల్ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. 1988లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ నటించిన బజారు రౌడీ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ తర్వాత వింత దొంగలు, ఓ తండ్రి కొడుకు వంటి సినిమాలలో నటించిన ఈమె.. హీరోయిన్ గా కెరియర్ పీక్స్ లో ఉండగానే 1988లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన శిరీష్ గోడ్ బొలెను వివాహం చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలం యునైటెడ్ కింగ్డమ్ లో నివాసం ఉన్న ఈమె.. 2004లో ఎం కుమారన్ సన్నాఫ్ లక్ష్మి అనే తమిళ సినిమా ద్వారా తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో తెలుగు సినిమా మిర్చిలో ప్రభాస్ కి అమ్మగా నటించి, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి అత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది అంతేకాదు ఇక్కడ తన అందంతో కుర్ర హీరోయిన్లకి కూడా గట్టిపోటీ ఇచ్చింది నదియా.

ఇదిలా ఉండగా తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికదా ఒక వీడియో పంచుకుంది నదియా. జిమ్ లో వర్క్ఔట్స్ చేస్తున్న వీడియోని ఆమె షేర్ చేసింది. పుష్ అప్స్ చేస్తూ.. డంబెల్స్ మోస్తూ 58 వయసు సంవత్సరాల వయసులో కూడా అంతే ఫిట్గా ఎక్సర్సైజ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా నదియా షేర్ చేసిన ఈ జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఈ రేంజ్ లో ఫిట్నెస్ అంటే ఊహించడం కూడా కష్టంగా ఉంది మేడం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నదియా కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.