జీబ్రా డ్రెస్‌లో నభా నటేష్ గ్లామర్ షో..స్టైల్ బ్లాస్ట్!
ఇక ఈ డ్రెస్‌కు ఉన్న స్వీట్‌హార్ట్ నెక్ లైన్, పఫ్డ్ హాఫ్-స్లీవ్స్ ఆమెకు ఒక క్లాసీ అండ్ స్టైలిష్ లుక్‌ను తీసుకొచ్చాయి. ఈ డ్రెస్‌లో నభా చాలా కాన్ఫిడెంట్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది.
By: Madhu Reddy | 29 May 2026 10:00 PM ISTటాలీవుడ్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యువతను ఆకట్టుకున్ననభా నటేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో తన తాజా ఫోటోలతో హల్‌చల్ చేస్తోంది. తన నటనతోనే కాదు, అదిరిపోయే ఫ్యాషన్ సెన్స్‌తోనూ అందరినీ ఆకట్టుకునే ఈ బ్యూటీ, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ, స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న నభా ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం..
అదిరిపోయిన జీబ్రా ప్రింట్ డ్రెస్:
నభా నటేష్ ఎప్పుడూ డిఫరెంట్ ఫ్యాషన్స్ ట్రై చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె రెడ్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉన్న జీబ్రా ప్యాటర్న్ మిడీ డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ డ్రెస్‌కు ఉన్న స్వీట్‌హార్ట్ నెక్ లైన్, పఫ్డ్ హాఫ్-స్లీవ్స్ ఆమెకు ఒక క్లాసీ అండ్ స్టైలిష్ లుక్‌ను తీసుకొచ్చాయి. ఈ డ్రెస్‌లో నభా చాలా కాన్ఫిడెంట్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది.
ఫ్రెండ్స్‌తో చిల్ అవుతూ.. క్రేజీ క్యాప్షన్:
ఈ ఫోటోలను షేర్ చేస్తూ నభా పెట్టిన క్యాప్షన్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. "మే హవె బీన్ ది ప్లేస్ మైట్ హవె బీన్ ది కంపెనీ ... అంటూ తన ఫ్రెండ్స్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంది. ఇక తన బెస్ట్ గ్యాంగ్‌తో కలిసి దిగిన ఈ ఫోటోలలో నభా ముఖంలో ఉన్న హ్యాపీనెస్, ఎనర్జీ చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.
కెరీర్‌లో దూసుకుపోతున్న నభా:
నభా కేవలం గ్లామర్ కోసమే కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది. 2024లో వచ్చిన 'డార్లింగ్' సినిమాలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న క్యారెక్టర్‌లో ఆరు విభిన్న షేడ్స్ చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం కమర్షియల్ హీరోయిన్‌గానే కాకుండా, తనేంటో ఆ సినిమాతో నిరూపించుకుంది.
చేతినిండా పాన్-ఇండియా ప్రాజెక్టులతో నభా కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది.నిఖిల్ సిద్ధార్థ్‌తో కలిసి నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా "స్వయంభూ"లో ప్రిన్సెస్ 'సుందరవల్లి'గా కనిపించబోతోంది. అలాగే, త్వరలోనే విడుదల కానున్న హై-స్టేక్స్ యాక్షన్-అడ్వెంచర్ మూవీ "నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్" లో 'పార్వతి' అనే పవర్‌ఫుల్ రోల్ చేస్తోంది. ఈ సినిమాలతో ఆమె రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయం.
బబ్లీ రోల్స్ నుండి ఇప్పుడు పీరియడ్ డ్రామాలు, థ్రిల్లర్ సినిమాలతో బిజీగా మారిన నభా, అటు సినిమాల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్న ఈ 'ఇస్మార్ట్ బ్యూటీ' రాబోయే సినిమాలతో మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆశిద్దాం.
