పరదా చాటున నడుము అందాలతో హైలెట్ అవుతున్న నభా నటేష్!
మరి ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అంటే.. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. కన్నడ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్..
By: Madhu Reddy | 10 Oct 2025 6:08 PM ISTచాలామంది హీరోయిన్లు వెస్ట్రన్ డ్రెస్సుల్లో కంటే చీరలలో మరింత అందంగా కనిపిస్తారు. అలా చీర కట్టుకుంటే ఆ అందమే వేరు.. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా చీర కట్టుకొని నడుము అందాలను హైలైట్ చేస్తూ కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. మరి ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అంటే.. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. కన్నడ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్..
తెలుగులోకి 'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసినా అంత గుర్తింపు రాలేదు. కానీ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో నభా నటేష్ కి టాలీవుడ్ లో గుర్తింపు లభించింది. అలా నభా నటేష్ తెలుగులో ఇస్మార్ట్ బ్యూటీగా సెటిల్ అయిపోయింది.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్ కి అవకాశాలు ఎక్కువ గా రావడం లేదు.
దాంతో ఇండస్ట్రీలో బిజీ అయి చేతినిండా అవకాశాలు రావడం కోసం తన అందాలతో అటు ఫాలోవర్లని ఇటు దర్శక నిర్మాతలని ఆకట్టుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే.. సాంప్రదాయంగా చీర కట్టుకొని ఉన్న నభా నటేష్ ఈ చీరలో కూడా తన అందాలను ఒలకబోస్తూ చూసేవారికి చెమటలు పట్టిస్తోంది. నభా నటేష్ అందాలను అలా చీరలో చూసిన వాళ్లు పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు.
వింటేజ్ లుక్ లో పేస్టల్ గ్రీన్ కలర్ శారీ , క్రీం కలర్ బ్లౌజ్ వేసుకొని తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసింది. ఈ వింటేజ్ లుక్ లో నభా నటేష్ అదిరిపోతోంది. అంతేకాదు వింటేజ్ శారీ కి తగ్గట్టుగానే తన కట్టుబొట్టు ఉండడంతో చాలామంది ఫాలోవర్స్ సీనియర్ హీరోయిన్ల మాదిరి అద్భుతంగా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ హీరోయిన్ సినిమాల విషయానికి వస్తే..తెలుగులో సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అదుగో, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్, రవితేజతో డిస్కో రాజా, సాయి దుర్గ తేజ్ తో సోలో బతుకే సో బెటర్ వంటి సినిమాల్లో నటించింది.
నభా నటేష్ నుండి రాబోయే సినిమాల విషయానికి వస్తే.. హీరో నిఖిల్ తో కలిసి స్వయంభు అనే పాన్ ఇండియా మూవీతో పాటు నటుడు విరాట్ కర్ణతో నాగబంధం అనే సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
