Begin typing your search above and press return to search.

నభా నటేష్ హుక్ స్టెప్.. ప్రైజులు గెలిచేలా ఓ ఛాలెంజ్

సినీ ఇండస్ట్రీలో ఒక పాట హిట్ అవ్వాలంటే కేవలం ట్యూన్ బాగుంటే సరిపోదు, ఆ పాటకు తగ్గట్టుగా ఇచ్చే డ్యాన్స్ మూమెంట్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలి.

By:  M Prashanth   |   10 May 2026 1:40 PM IST
నభా నటేష్ హుక్ స్టెప్.. ప్రైజులు గెలిచేలా ఓ ఛాలెంజ్
X

సినీ ఇండస్ట్రీలో ఒక పాట హిట్ అవ్వాలంటే కేవలం ట్యూన్ బాగుంటే సరిపోదు, ఆ పాటకు తగ్గట్టుగా ఇచ్చే డ్యాన్స్ మూమెంట్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'హుక్ స్టెప్ ఛాలెంజ్' అనే కాన్సెప్ట్ సినిమాల ప్రమోషన్లకు ప్లస్ పాయింట్ గా మారుతోంది. లేటెస్ట్ గా ‘నాగబంధం’ సినిమా నుంచి విడుదలైన ‘సుర సుర’ సాంగ్‌కు సంబంధించి హీరోయిన్ నభా నటేష్ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.




తన ఎనర్జిటిక్ మూమెంట్స్‌తో నభా ఈ పాటకు సరికొత్త జోష్ తీసుకొచ్చింది. నాగబంధం టీమ్ ఇప్పుడు ఈ పాట కోసం ‘సుర సుర హుక్ స్టెప్ ఛాలెంజ్’ను అధికారికంగా ప్రారంభించింది. పెళ్లి సంబరాల నేపథ్యంలో సాగే ఈ మాస్ సాంగ్‌లో నభా నటేష్ పద్ధతిగా లంగా వోణీలో కనిపిస్తూనే, అదిరిపోయే స్టెప్పులతో కేక పుట్టించింది. ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఎవరైనా ఈ పాటకు తమ రీల్స్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు. ఉత్తమంగా డ్యాన్స్ చేసిన వారికి ఎగ్జైటింగ్ ప్రైజులు కూడా అందజేస్తామని మేకర్స్ ప్రకటించారు. జునైద్ కుమార్, అభే అందించిన డ్రమ్ బీట్స్ ఈ పాటకు హైలెట్ గా నిలిచాయి. దానికి తగ్గట్టుగానే గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ పాటలో ఊపును పెంచింది. నభా నటేష్ తన మేకోవర్ తో పాటు తన డ్యాన్స్ టైమింగ్‌తో ఈ హుక్ స్టెప్‌ను బాగా పాపులర్ చేస్తోంది.

ఇప్పటికే ఈ ఛాలెంజ్ మొదలవ్వడంతో యూత్ అంతా తమదైన శైలిలో రీల్స్ చేస్తూ పోటీ పడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి ఇంటరాక్టివ్ ఐడియాలు పెట్టడం వల్ల సినిమాపై క్రేజ్ బాగా పెరుగుతోంది. మరోవైపు నాగబంధం సినిమా మైథలాజికల్ అడ్వెంచర్ జోనర్ లో వస్తుండటంతో సినిమాపై మొదటి నుంచీ పాజిటివ్ బజ్ ఉంది. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో, 1750ల కాలం నాటి రహస్యాలు, పురాతన నిధుల అంశాలను చర్చించబోతున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ లోని విజువల్స్ అబ్బురపరిచాయి. ఇప్పుడు ఈ రెండో పాటతో మ్యూజికల్ గా కూడా సినిమా ఆకట్టుకుంటోంది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో నభా నటేష్ పాత్ర కూడా చాలా కీలకమని సమాచారం. ఇక నభా నటేష్ డ్యాన్స్ వీడియోతో ‘నాగబంధం’ ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కు వెళ్లాయి. ఈ ఛాలెంజ్ ద్వారా పాటకు మంచి రీచ్ వస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. అడ్వెంచరస్ ఎలిమెంట్స్ తో పాటు ఇలాంటి మాస్ అండ్ క్లాస్ సాంగ్స్ ఉండటం వల్ల సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. జూలై 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.