స్టైలిష్ ఫోజులతో ఆకట్టుకుంటున్న నభా నటేష్!
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు ముఖ్యంగా వర్కౌట్స్ చేస్తూ కూడా ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
By: Madhu Reddy | 15 Dec 2025 4:42 PM ISTసోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు ముఖ్యంగా వర్కౌట్స్ చేస్తూ కూడా ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది జిమ్లో వర్కౌట్స్ చేయడమే కాకుండా అక్కడ స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చి అభిమానులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న నభా నటేష్ కూడా జిమ్ నుండీ కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం నభా నటేష్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
1995 డిసెంబర్ 11న కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లా శృంగేరి లో జన్మించిన ఈమె మంగళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది. చదువుకుంటుండగానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013లో టాప్ టెన్ లో ఒకరిగా కనిపించింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈమె.. తొలిసారి 2015లో శివ రాజ్ కుమార్ తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయలో నటించింది. ఈ చిత్రం ద్వారానే సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది నభా నటేష్. ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడంతో అమ్మడికి మంచి గుర్తింపు లభించింది.
2018లో తెలుగులో తొలిసారి నన్ను దోచుకుందువటే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే గత కొంతకాలం క్రితం యాక్సిడెంట్ బారిన పడ్డ ఈమె దాని నుండి రికవరీ అవ్వడానికి దాదాపు ఏడాదికి పైగానే సమయాన్ని తీసుకుంది. ఇప్పుడు వరుసగా హిస్టారికల్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారింది నభా నటేష్.
ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. సుందరవల్లి పాత్రలో నటిస్తున్నట్లు ఈమె పాత్రను రివీల్ చేశారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో భువన్ శ్రీకర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంతోపాటు విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న నాగబంధం అనే చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఒకవైపు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా మరొకవైపు ఇలా హిస్టారికల్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. దీనికి తోడు ఒక వైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది నభా నటేష్.
