Begin typing your search above and press return to search.

వెకేషన్ వైబ్స్‌లో హాట్ లుక్.. నభా పిక్స్ నెట్‌లో హీట్..

టాలీవుడ్ ట్రెండీ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన గ్లామర్ అండ్ స్టైలిష్ ఫొటోలతో కుర్రకారును మైమరిపిస్తూనే ఉంటుంది.

By:  Madhu Reddy   |   30 Sept 2026 6:08 PM IST
వెకేషన్ వైబ్స్‌లో హాట్ లుక్.. నభా పిక్స్ నెట్‌లో హీట్..
X

టాలీవుడ్ ట్రెండీ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన గ్లామర్ అండ్ స్టైలిష్ ఫొటోలతో కుర్రకారును మైమరిపిస్తూనే ఉంటుంది. తాజాగా సముద్రం మధ్యలో ఉన్న ఒక ప్రశాంతమైన ప్రదేశం నుంచి ఆమె షేర్ చేసిన లేటెస్ట్ వెకేషన్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. 'సముద్రం మధ్యలో ఉన్న చిన్న భూభాగంపై!' అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎండలో మెరుస్తున్న ఆమె అందాలు, ఈ వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో నిలిచాయి.




సన్-కిస్డ్ లుక్‌లో నభా అదరహో:

ఆ ప్రశాంతమైన సముద్ర తీరంలో, తాటాకులతో కూడిన విల్లాలో నభా చాలా కాన్ఫిడెంట్‌‌గా పోజులిచ్చింది. స్టైలిష్ బ్రౌన్ బ్యాండేయు టాప్ టెక్చర్డ్ హై-వాస్టెడ్ లెగ్గింగ్స్‌లో ఆమె సూపర్ గ్లామరస్‌గా కనిపిస్తోంది. సూర్యకాంతి నేరుగా మొహంపై పడకుండా ఒక చేత్తో కళ్లను కప్పుకుంటూ ఆమె ఇచ్చిన ఫోజు చూసేవారిని కట్టిపడేస్తోంది. ఇక ఆ నేచురల్ గ్లోయింగ్ స్కిన్, సముద్రపు అలల నేపధ్యం ఆమె లుక్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి.




ఫ్యాన్స్ నుంచి ప్రశంసల వర్షం:

నభా షేర్ చేసిన ఈ హాట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్‌ను చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కామెంట్ బాక్స్‌లో "ప్రెట్టీ", "పీక్ బ్యూటీ", "స్వీట్‌హార్ట్", "యు ఆర్ ఆసమ్ బ్యూటీ" అంటూ రకరకాల కామెంట్లతో నెట్టింట మోత మోగిస్తున్నారు. ఇక క్షణాల వ్యవధిలోనే వైరల్ అయిన ఈ ఫొటోలు నభా గ్లామర్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాయి.




ఇంజనీరింగ్ నుండి టాలీవుడ్ 'ఐస్మార్ట్ బ్యూటీ' వరకు:

ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నభా, సినిమాల్లోకి రాకముందు భరతనాట్యం మరియు మోడలింగ్‌లో శిక్షణ తీసుకుంది. 2015లో కన్నడ సినిమా 'వజ్రకాయ'తో తన నటన ప్రయాణాన్ని ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక రామ్ పోతినేని సరసన నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ చిత్రంతో ఆమెకు 'ఇస్మార్ట్ బ్యూటీ' అనే అరుదైన పేరు వచ్చింది.




వైవిధ్యమైన సినిమాలతో బిజీగా నభా:

ఇక వరుసగా 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'మేస్ట్రో', 'డార్లింగ్' వంటి పలు విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తోంది. ఇటీవల వచ్చిన 'నాగబంధం తో హిట్ అందుకుంది..ఇక 'స్వయంభు' వంటి భారీ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌లో తన హవాను మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితాన్ని, వెకేషన్స్ ఎంజాయ్ చేసే క్షణాలను అభిమానులతో పంచుకోవడంలో నభా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ట్రెండీ పిక్స్ ఆమె స్టైల్ స్టేట్‌మెంట్‌కు నిదర్శనంగా నిలిచాయి. ఇక నటనతో పాటు గ్లామర్‌తోనూ కుర్రకారును అలరిస్తున్న ఈ బ్యూటీ, రాబోయే ప్రాజెక్ట్‌‌లతో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం..