ఉమెన్స్ డే స్పెషల్.. నభా నటేష్ కి అరుదైన గౌరవం!
నేడు ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన మహిళల గౌరవార్థం.. వారిని ప్రత్యేకంగా గౌరవిస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 8 March 2026 4:42 PM ISTనేడు ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన మహిళల గౌరవార్థం.. వారిని ప్రత్యేకంగా గౌరవిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా తన కోసం, కుటుంబం కోసం, సమాజ అభివృద్ధి కోసం అండగా నిలబడుతున్న ప్రతి మహిళకు సెలబ్రిటీలు, ప్రముఖులు, ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా అటు హీరోయిన్స్ కి కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవాలు లభించడంతో అభిమానులు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు.
ఇకపోతే నేడు ఉమెన్స్ డే సందర్భంగా అటు సంయుక్త మీనన్ లేడీ ఓరియంటెడ్ గా నటిస్తున్న 'ది బ్లాక్ గోల్డ్' సినిమా నుండి ఒక పవర్ఫుల్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. ఆమెకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇలాంటి సమయంలో ఒక మ్యాగజైన్ ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ కి స్పెషల్ ఉమెన్స్ డే విషెస్ తెలియజేస్తూ.. ఆమెకు అరుదైన గౌరవాన్ని అందించింది. అసలు విషయంలోకి వెళ్తే.. "షీ ఇండియా" అనే మ్యాగజైన్ కవర్ పేజ్.. బ్లాక్ అవుట్ ఫిట్ లో బాక్సింగ్ లుక్ లో ఉన్న నభా నటేష్ ఫోటోని తన కవర్ పేజ్ పై షేర్ చేస్తూ "నభా నటేష్ అన్ స్టాపబుల్" అంటూ ఆమెకు స్పెషల్ విషెస్ తెలియజేసింది.. ముఖ్యంగా ప్రపంచాన్నే ఇన్స్పైర్ చేస్తున్న ప్రతి ఒక్క మహిళకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అంటూ తన కవర్ పేజీపై నభా నటేష్ ఫోటోని షేర్ చేసింది షీ ఇండియా. ఇక ప్రస్తుతం షీ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనం ఇచ్చిన నభా నటేష్ పై.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు లభించిన ఈ గౌరవానికి ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
నభా నటేష్ కెరియర్ విషయానికి వస్తే.. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్ తో కలిసి తన ఖాతాలో మంచి విజయాన్ని చేరవేసుకుంది . ఇక డార్లింగ్ సినిమా తర్వాత రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యింది. యాక్సిడెంట్ కారణంగానే ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. ఇప్పుడు రెండు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిఖిల్ స్వయంభు తో పాటు నాగబంధం అనే సినిమాలో నటిస్తోంది.
రెండు చిత్రాలు కూడా విభిన్న జానర్ లు కావడం గమనార్హం. పైగా రెండు కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన టీజర్ , ఫస్ట్ లుక్ అప్డేట్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. సమ్మర్ స్పెషల్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు చిత్రాలతో నభా నటేష్ ఊహించని విజయాన్ని సొంతం చేసుకోవడం గ్యారెంటీ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
