అనార్కలిలో నభా నటేష్ అందాలు!
ఒకవైపు సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా గడిపేస్తూనే.. మరొకవైపు భిన్న విభిన్నమైన వస్త్రధారణతో ప్రేక్షకులను, నెటిజన్స్ ను అలరిస్తూ సోషల్ మీడియాలో మరింత ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు హీరోయిన్స్.
By: Madhu Reddy | 1 Jun 2026 11:44 AM ISTఒకవైపు సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా గడిపేస్తూనే.. మరొకవైపు భిన్న విభిన్నమైన వస్త్రధారణతో ప్రేక్షకులను, నెటిజన్స్ ను అలరిస్తూ సోషల్ మీడియాలో మరింత ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు హీరోయిన్స్. యంగ్ హీరోయిన్స్ ను మొదలుకొని సీనియర్ హీరోయిన్స్ వరకు ఎంతోమంది మరింత గ్లామర్ గా తయారవుతూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. అలా ఇటీవల ఏకంగా రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న అందాల తార నభా నటేష్.
నన్ను దోచుకుందువటే అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల తార నభా నటేష్.. మొదటి సినిమాతోనే ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ తో.. తనదైన గ్లామర్ తో వెండితెరపై మాయ చేసిన ఈ వయ్యారి.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. నిధి అగర్వాల్, రామ్ పోతినేని , నభా నటేష్ కలయికలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా నభా అందానికి యువత దాసోహం అయింది. అలా ఒక్కసారిగా ఒక్క చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈమెను ఎక్కువగా ఇస్మార్ట్ బ్యూటీగానే పరిగణించారు యువత.
మాస్ మహారాజా రవితేజతో డిస్కో రాజా సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఈ అమ్మడి కెరీర్ కి పెద్దగా ప్లస్ కాలేదు. ఆ తర్వాత సాయి ధరంతేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ వంటి సినిమాలలో నటించింది. ఇవి కూడా ఈమెకు నిరాశనే మిగిల్చాయి. ఇక చివరిగా డార్లింగ్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. దాంతో కొంతకాలం ఇండస్ట్రీకి విరామం తీసుకుంది . అదే సమయంలో చిన్న యాక్సిడెంట్ కారణంగా చేతికి చిన్న ఫ్రాక్చర్ కావడంతో ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీలో వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో బిజీగా మారింది.
అలా చారిత్రక పీరియడ్ డ్రామా స్వయంభు సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమాలో సుందరవల్లి అనే ఒక హుందాతనమైన యువరాణి పాత్రలో కనిపించబోతోంది. అలాగే నాగబంధం అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో పార్వతి అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ను పోషిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే త్వరలో స్వయంభూ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొకవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామర్ టచ్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆరెంజ్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన లాంగ్ అనార్కలి డ్రెస్ ధరించిన ఈమె ..తన అందాలతో హోయలు పోయింది. పొడవు డ్రెస్సుకి తగ్గట్టుగా పొడవాటి జుట్టు అందమైన చెవి దుద్దులను ధరించి ఆ కాటుక కళ్ళతో తన మేకోవర్ ను ఫుల్ ఫీల్ చేసుకుంది నభా నటేష్. మొత్తానికి అయితే ఈ అనార్కలి డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ చూపరులను విపరీతంగా అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
