తడి అందాలతో చెమటలు పట్టిస్తున్న నభా నటేష్!
గ్లామర్ వలకబోయడమే ట్రెండ్ గా పెట్టుకున్న కొంతమంది హీరోయిన్స్ ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు.
By: Madhu Reddy | 13 Sept 2025 5:58 PM ISTగ్లామర్ వలకబోయడమే ట్రెండ్ గా పెట్టుకున్న కొంతమంది హీరోయిన్స్ ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే చాలామంది హీరోలు గ్లామర్ ఫోటోలతో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కొంతమంది వ్యక్తిగత విషయాలతో పాపులారిటీ సంపాదించుకుంటే.. మరి కొంతమంది సినిమాల ద్వారా క్రేజ్ పొందుతున్నారు. ఇంకొంతమంది ఇలా గ్లామర్ ఫోటోలతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన అందాలతో అభిమానులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ప్రముఖ బ్యూటీ నభా నటేష్.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. తాజాగా చీరకట్టులో సరికొత్త అందాలతో అందరినీ మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా నభా నటేష్ ను ఈ ఫోజ్ లో చూసేసరికి కుర్రాళ్ళు సైతం తట్టుకోలేకపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. నేవీ బ్లూ కలర్ చీర కట్టుకొని అందాలతో మెస్మరైజ్ చేసింది.
బ్లూ కలర్ చీర కట్టుకొని అందుకు తగ్గట్టుగా జువెలరీ ధరించిన ఈమె.. మెడను బోసిగానే ఉంచేసింది. జుట్టును వదిలేసి నీటిలో కదులుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. నభా నటేష్ తాజాగా తడి అందాలతో షేర్ చేసిన ఈ ఫోటోలలో ఆమె నడుము, ఎద అందాలు హైలెట్ గా నిలిచాయి. మొత్తానికి అయితే ఈమె షేర్ చేసిన ఈ తడి అందాల ఫోటోలు ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.
నభా నటేష్ కెరియర్ విషయానికి వస్తే.. 1995 డిసెంబర్ 11న కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లా శ్రింగేరిలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. మంగళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది. మోడల్ గా కెరియర్ ను ఆరంభించింది. ఆ తర్వాత 2015లో శివరాజ్ కుమార్ తో కలిసి కన్నడ మూవీ 'వజ్రకాయ' అనే చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013లో టాప్ టెన్ లో ఒకరిగా కనిపించి అందరిని మెప్పించింది.
నభా నటేష్ సినిమాల విషయానికొస్తే.. 2018లో 'నన్ను దోచుకుందువటే' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించారు. 2018లో విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హిందీలో 'ప్యార్ కి జీత్' పేరుతో డబ్బింగ్ చేశారు. ఈ సినిమా తర్వాత అదుగో అనే చిత్రంలో కూడా నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతికే సో బెటర్, డార్లింగ్ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం నిఖిల్ తో కలిసి 'స్వయంభు' అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఇందులో సంయుక్త మీనన్ కూడా హీరోయిన్గా నటిస్తోంది.
