అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీసిన ఇస్మార్ట్ బ్యూటీ..
నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుని ఇస్మార్ట్ బ్యూటీగా చలామణి అవుతోంది ఈ ముద్దుగుమ్మ.
By: Madhu Reddy | 21 Jan 2026 11:54 AM ISTనభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుని ఇస్మార్ట్ బ్యూటీగా చలామణి అవుతోంది ఈ ముద్దుగుమ్మ.'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత 'అదుగో' అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా కూడా ఈమెకు పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
అలా సోలో బ్రతుకే సో బెటర్, డార్లింగ్, డిస్కో రాజా వంటి చిత్రాలలో నటించిన ఈమె.. ప్రస్తుతం ప్రముఖ హీరో నిఖిల్ సరసన స్వయంభు చిత్రంతోపాటు నాగబంధం అనే సినిమాలో కూడా నటిస్తోంది.ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా విడుదల చేశారు.రెండింటిలో కూడా చాలా అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది నభానటేష్.
మరోవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో అభిమానులను ఆకట్టుకున్న ఈమె.. తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక వీడియోని పంచుకుంది. అందులో కొరియోగ్రాఫర్ ఫాల్గుణి తో కలిసి జిమ్ములో అదిరిపోయే స్టెప్స్ తో డాన్స్ ఇరగదీసింది. పొట్టి నిక్కరు వేసుకొని అందాలు కనిపించేలా డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా నడుముని విల్లులా వంచుతూ.. మెలికలు తిప్పేసి తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి "తక్కువ రిసొల్యూషన్ వేగం, అధిక రిసొల్యూషన్ మూడ్.. ఫాల్గుణి తో జామింగ్" అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా తన అద్భుతమైన డాన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
నభా నటేష్ విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇక అందులో భాగంగానే ఇలా ఒకవైపు తన డాన్స్ స్టెప్పులతో ఆడియన్స్ హృదయాలను దోచుకునే ప్రయత్నం చేస్తోంది. ఏది ఏమైనా ప్రముఖ కొరియోగ్రాఫర్ తో చేసిన ఈ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నభా నటేష్ లో ఈ టాలెంట్ కూడా ఉందా ? తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంకొంతమంది ఏకంగా ఒక స్టెప్ ముందుకు తీసుకుని నభా నటేష్ స్పెషల్ సాంగ్స్ చేస్తే కచ్చితంగా సూపర్ హిట్ అందుకుంటుంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అమ్మడికి ఈ రెండు సినిమాలు ఎలాంటి సక్సెస్ ను అందిస్తాయో చూడాలి.
