Begin typing your search above and press return to search.

పరికిణీలో నభా నటేష్ అందాలు.. సుందరవల్లి అందానికి ఫాన్స్ ఫిదా!

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన గ్లామర్ బ్యూటీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   2 March 2026 3:10 PM IST
పరికిణీలో నభా నటేష్ అందాలు.. సుందరవల్లి అందానికి ఫాన్స్ ఫిదా!
X

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన గ్లామర్ బ్యూటీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం , అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. ఈ ఏడాది ఎలాగైనా సరే పాన్ ఇండియా స్టార్ డంను సొంతం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే స్వయంభు తో పాటు నాగబంధం అనే రెండు విభిన్న జానర్లలో సినిమాలు చేస్తోంది. పైగా ఈ రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి.





ఒకవైపు ఈ సినిమాల బిజీ షెడ్యూల్లో పాల్గొంటూనే మరొకవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా తమ సినిమాలపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వేదికగా రోజుకొక గెటప్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా లైట్ ఆరెంజ్ లంగా వోని ధరించిన ఈమె రాధా గెటప్ లో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నభా నటేష్ ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకు అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా రాధా గెటప్లో సుందరవల్లి అందాలు అదరహో అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇలా తన అందంతో అభిమానులను ఆకట్టుకోవడంతో కృష్ణుడికై వేచిచూసే రాధా గెటప్లో నభా అద్భుతంగా ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.





నభా నటేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తోంది ఇందులో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ నటిస్తూ ఉండగా.. నభా నటేష్ మరో హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా సీడెడ్ హక్కులను 7.20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒకవైపు కార్తికేయ 2సినిమా తరువాత నిఖిల్ కి పెరిగిన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని.. మరోవైపు భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒక పరాక్రమవంతుడైన యోధుడిగా నిఖిల్ కనిపించనున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెరిగి సీడెడ్ ఏరియాలో ఈ మేరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.





ఇకపోతే ఈ సినిమా ఓటిటి డీల్ కూడా ఈ వారంలోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉండడంతో నిర్మాతలకు.. విడుదలకు ముందే మంచి లాభాలను ఈ సినిమా తెచ్చి పెడుతోంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే మార్చి 15వ తేదీన ఫస్ట్ కాపీ సిద్ధమైన తర్వాత చిత్ర యూనిట్ చాలా గ్రాండ్గా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.





నభా నటేష్ నటిస్తున్న మరో చిత్రం నాగబంధం. ఈ ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కూడా పాన్ ఇండియా వైడ్ విడుదలకు సిద్ధమవుతోంది. నాగబంధం : ది సీక్రెట్ ట్రెజర్ లో నభా పార్వతీ పాత్రను పోషిస్తుంది . అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో దైవిక పాత్రలో నభా కనిపించనుంది. ఎన్ఐకె స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అలా ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలతో నభా ఈసారి పాన్ ఇండియా స్టేటస్ ని సొంతం చేసుకోవడం గ్యారెంటీ అని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.