Begin typing your search above and press return to search.

అందరిని ఫూల్స్ చేసిన నా అన్వేష్… అసలు నిజం బయటపడింది!

అకౌంట్ తాత్కాలికంగా ఆగిపోయిన విషయాన్ని సాకుగా తీసుకున్న అన్వేష్, తన అకౌంట్ పూర్తిగా పోయిందని ఒక చిన్న నాటకం ఆడాడు.

By:  Madhu Reddy   |   20 Feb 2026 11:54 PM IST
అందరిని ఫూల్స్ చేసిన నా అన్వేష్… అసలు నిజం బయటపడింది!
X

ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ 'నా అన్వేష్' ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా కలకలం రేపింది. లక్షలాది మంది ఫాలోవర్లు ఆందోళన చెందగా, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ అన్వేష్ అకౌంట్ పోయిందంటూ హోరెత్తించాయి. కానీ, తాజాగా అన్వేష్ స్వయంగా స్పందించి అసలు విషయం చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అది నిజంగా పోలేదు, కేవలం ఒక చిన్న టెక్నికల్ ఇష్యూని అడ్డం పెట్టుకుని అన్వేష్ అందరినీ ఫూల్స్ చేశాడన్నమాట!

మదనపల్లి వీడియోతో మొదలైన అసలు రచ్చ:

అసలు విషయం ఏంటంటే, మదనపల్లిలో జరిగిన ఒక చిన్నారి ఉదంతానికి సంబంధించి అన్వేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో సున్నితమైన అంశం కావడంతో ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ప్రూఫ్ అడిగింది. అన్వేష్ తన పాస్‌పోర్ట్ వివరాలను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు చిన్న పొరపాటు జరగడంతో, సెక్యూరిటీ కారణాల దృష్ట్యా అకౌంట్‌ను 48 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది కేవలం టెక్నికల్ వెరిఫికేషన్ ప్రక్రియ మాత్రమే తప్ప, అకౌంట్ శాశ్వతంగా డిలీట్ అవ్వలేదు.

'నేను కావాలనే అబద్ధం చెప్పా' - అన్వేష్ షాకింగ్ క్లారిటీ:

అకౌంట్ తాత్కాలికంగా ఆగిపోయిన విషయాన్ని సాకుగా తీసుకున్న అన్వేష్, తన అకౌంట్ పూర్తిగా పోయిందని ఒక చిన్న నాటకం ఆడాడు. నా అకౌంట్ పోయింది, దీనికి కారణం అయిన వాళ్లకు రేపటినుండి బుద్ధి చెప్తాను అన్నట్టు వీడియో పెట్టి రచ్చ చేసాడు. అందరికి అది నిజం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి సోషల్ మీడియాలో అందరినీ బురిడీ కొట్టించాడు. అసలు తాను ఇలా అబద్ధం చెబితే తన ఫాలోవర్లు, మీడియా వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలనే ఇలా చేశానని, అందరినీ ఫూల్స్ చేయడం, ఇప్పుడు నా తప్పు లేకుండా ఇలా మాట్లాడుతున్నారు అని వీడియో పెట్టటంతో అసలు నిజం భయటపడింది.

నెటిజన్ల రియాక్షన్.. ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా:

అన్వేష్ మాటలు విన్న నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒకపక్క తన అకౌంట్ తిరిగి వచ్చినందుకు ఫాలోవర్లు సంతోషిస్తున్నా, మరోపక్క ఇలాంటి సీరియస్ విషయంలో జోక్ చేయడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక కేవలం హైప్ కోసమో లేదా రీచ్ పెంచుకోవడం కోసమో, ఇలాంటి పనులు చేయడం అన్వేష్‌కే చెల్లిందని విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా, 48 గంటల హై డ్రామా తర్వాత 'నా అన్వేష్' ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సురక్షితంగా ఉందని తేలడంతో ఈ వివాదానికి తెరపడింది.