Begin typing your search above and press return to search.

'డ్యూడ్' ఇంటర్వెల్ లో 10 సినిమాల టీజర్లు

అదే సమయంలో హైదరాబాద్ మైత్రి విమల్ థియేటర్ లో డ్యూడ్ మూవీ చూసిన వారు పెట్టిన పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారాయి.

By:  M Prashanth   |   18 Oct 2025 3:43 PM IST
డ్యూడ్ ఇంటర్వెల్ లో 10 సినిమాల టీజర్లు
X

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, ప్రేమలు ఫేమ్ మమితా బైజు లీడ్ రోల్స్ లో నటించిన డ్యూడ్ మూవీ రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అసెస్టింట్ డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అయిన ఆ సినిమాను టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు.

అక్టోబర్ 17వ తేదీన థియేటర్స్ లో విడుదల అయిన డ్యూడ్ సినిమా చూసిన వారంతా అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు రివ్యూస్ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రదీప్ యాక్టింగ్ ను కొనియాడుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ మైత్రి విమల్ థియేటర్ లో డ్యూడ్ మూవీ చూసిన వారు పెట్టిన పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారాయి.

నగరంలోని బాలానగర్ లో ఉన్న ఆ థియేటర్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు అక్కడ ప్రదీప్ డ్యూడ్ సినిమా ప్రదర్శితమవుతుండగా.. సినిమా మొదలవ్వక ముందు, ఇంటర్వెల్ తో కలిపి 10 సినిమాల టీజర్లను ప్లే చేస్తున్నారు. ఆ విషయాన్ని చెబుతూ పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్లు.. ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ 10 చిత్రాలు ఇవే..

1. రావు బహదూర్

2. విశ్వంభర

3. అఖండ 2

4. ఉస్తాద్ భగత్ సింగ్

5. పెద్ది

6. ది రాజా సాబ్

7. కపుల్ ఫ్రెండ్లీ

8. అనగనగా ఒక రాజు

9. ది ప్యారడైజ్

10. ఆంధ్ర కింగ్ తాలూకా

అయితే ఆ పది సినిమాల్లో చాలా చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కొన్ని 2025లోనే విడుదల అవ్వనున్నాయి. వాటిలో చాలా చిత్రాల షూటింగ్స్ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. మరిన్ని త్వరలోనే పూర్తి చేసుకోనున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుని రిలీజ్ కు కూడా సిద్ధమవుతున్నాయి.

ఇప్పటికే ఆ పది సినిమాల టీజర్స్ ను ఆయా మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ ఒకేసారి డ్యూడ్ మూవీ సమయంలో ప్లే చేయడం విశేషం. సాధారణంగా ఏ సినిమా టైమ్ లో అయినా థియేటర్స్ లో గ్లింప్సెస్ ప్లే అవుతుంటాయి.

అందుకు గాను ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటారు. కానీ ఇప్పుడు మైత్రి విమల్ థియేటర్ లో ఏకంగా 10 సినిమాల టీజర్లు ప్లే చేయడం ఆకర్షణీయంగా మారింది. థియేటర్ కు ఒక మూవీ చూడడానికి వెళ్లి.. అక్కడ పది సినిమాల గ్లింప్స్ ను చూశామని నెటిజన్లు, సినీ ప్రియులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.