Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు హిట్ కాంబో రిపీట్..!

శ్రీవిష్ణు కొత్త సినిమా పూజా కార్యక్రమాలకు నారా రోహిత్, సాయి దుర్గ తేజ్ చీఫ్ గెస్టులుగా వచ్చారు.

By:  Ramesh Boddu   |   2 Oct 2025 11:53 AM IST
శ్రీవిష్ణు హిట్ కాంబో రిపీట్..!
X

టాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు దసరా రోజున జరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీవిష్ణుతో ఆల్రెడీ రామ్ అబ్బరాజు సామజవరగమన సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా కాంబోని రిపీట్ చేస్తూ ఈ కొత్త మూవీ మొదలు పెట్టారు.


రామ్ అబ్బరాజు, శ్రీవిష్ణు కొత్త జోనర్ లో..

శ్రీవిష్ణు కొత్త సినిమా పూజా కార్యక్రమాలకు నారా రోహిత్, సాయి దుర్గ తేజ్ చీఫ్ గెస్టులుగా వచ్చారు. నారా రోహిత్, సాయి తేజ్ స్క్రిప్ట్ ని అందించారు. సాయి తేజ్ ఫస్ట్ క్లాప్ ని కొట్టారు. రాం అబ్బరాజు, శ్రీవిష్ణు ఈ కాంబో ఈసారి కొత్త జోనర్ లో ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. కొత్త స్టోరీ లైన్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు.

శ్రీవిష్ణు సినిమాలు అన్నీ కూడా ఎంటర్టైనింగ్ తోనే వస్తుంటాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేసేలా అతని సినిమాలు ఉంటాయి. రీసెంట్ గా సింగిల్ తో శ్రీవిష్ణు మరో సక్సెస్ అందుకున్నాడు. ఆల్రెడీ అతని మరో సినిమా సెట్స్ మీద ఉంది. ఇక ఇప్పుడు రాం అబ్బరాజుతో సినిమా లాక్ అయింది. రామ్ అబ్బరాజు ప్రస్తుతం శర్వానంద్ తో నారి నారి నడుమ మురారి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అసలైతే 2026 సంక్రాంతి రిలీజ్ అని అన్నారు. ఆ సినిమా రిలీజ్ అవ్వగానే శ్రీవిష్ణు సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

ఆడియన్స్ పల్స్ పట్టేసిన శ్రీవిష్ణు..

హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తే అదే రిజల్ట్ ఆశిస్తారు ఆడియన్స్. శ్రీవిష్ణుతో ఆల్రెడీ హిట్ కొట్టిన రాం అబ్బరాజు అండ్ టీం అతనితో మరో క్రేజీ సినిమాతో రాబోతున్నారు. ఐతే కొత్త జోనర్ అంటూ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి థ్రిల్ అందిస్తుందో చూడాలి.

ఆడియన్స్ పల్స్ పట్టేసిన శ్రీవిష్ణు మంచి ఎంటర్టైనింగ్ సినిమాలతో వస్తున్నాడు. కథ కాస్త కొద్దిగా ఉంటూ స్క్రీన్ ప్లే మొత్తం కడుపుబ్బా నవ్వించేలా ప్రయత్నిస్తున్నాడు. అలాంటి సినిమాలే శ్రీవిష్ణుకి మంచి ఫలితాలు అందిస్తున్నాయి. శ్రీవిష్ణు కూడా తనని ఆడియన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాంటి సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు. సామజవరగమన కాంబో సినిమా మళ్లీ అదే మార్క్ ఎంటర్టైనర్ తో వస్తే మాత్రం పక్కా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.