Begin typing your search above and press return to search.

రూటు మార్చిన మైత్రి మూవీ మేకర్స్.. ఇకపై ఆ సినిమాలపై ఫోకస్

కాగా, గతంలో పెద్ద స్టార్లతో సినిమాలపైనే ఫోకస్ చేసిన మైత్రి సంస్థ ఇప్పుడు బలమైన కంటెంట్ ఉండే చిన్న సినిమాలపైనా దృష్టి పెట్టనుంది.

By:  M Prashanth   |   11 Aug 2025 11:15 PM IST
రూటు మార్చిన మైత్రి మూవీ మేకర్స్.. ఇకపై ఆ సినిమాలపై ఫోకస్
X

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. ఇండియన్ సినిమాలో మైత్రి భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. గతేడాది ఈ సంస్థ నుంచి వచ్చిన పుష్ప 2 ఏ రేంజ్ లో రికార్డులు సాధించిందో ప్రత్యక్షంగా చూశాం. ప్రస్తుతం ఈ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లు రూపొందుతున్నాయి.

తెలుగులో బాడా హీరోలతోనే కాకుండా మైత్రి బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, సల్మాణ్ ఖాన్, రామ్ చరణ్, అజిత్ లతో నూ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇలా పెద్ద స్టార్ల సినిమాలతో మైత్రి అప్ కమింగ్ లైనప్ గ్రాండ్ గా కనిపిస్తుంది. రానున్న కొన్నేళ్లు ఈ సంస్థ నుంచి పాన్ఇండియా సినిమాలు రానున్నాయి.

కాగా, గతంలో పెద్ద స్టార్లతో సినిమాలపైనే ఫోకస్ చేసిన మైత్రి సంస్థ ఇప్పుడు బలమైన కంటెంట్ ఉండే చిన్న సినిమాలపైనా దృష్టి పెట్టనుంది. ఈ చిన్న బడ్జెత్ తో రూపొందించేందుకు స్ట్రిప్ట్ లు కూడా ఫైనల్ చేస్తున్నారట. ఇందులో బడా బడా స్టార్లు కాకుండా చిన్న నటీనటులు, కొత్త వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మైత్రి మేకర్స్ భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో నాన్ థియేట్రికల్ డీల్స్ చేయడంలో మైత్రి మూవీ మేకర్స్ కు మంచి పట్టు ఉంది. ఈ నాన్ థియేట్రికల్ మార్కెట్ లో వచ్చే డబ్బుతో చిన్న బడ్జెట్ సినిమాలు రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మైత్రికి డిస్ట్రిబ్యూషన్ పై కూడా పట్టు ఉంది. అందుకోసం డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ ఫామ్ ను కూడా స్థాపించారు.

ఇలా తాము రూపొందించే చిన్న సినిమాలను స్వయంగా మైత్రినే విడుదల కూడా చేసుకోవచ్చు. రానున్న కొన్నేళ్లలో వరుసగా చిన్న బడ్జెట్ సినిమాలు కూడా తీసుకురావాలని మైత్రి మేకర్స్ భావిస్తున్నారు. తెలుగులో ఇలా ఓవైపు పెద్ద సినిమాలు చేస్తూనే.. మరోవైపు చిన్న బడ్జెట్ సినిమాలను ఎంకరేజ్ చేసే నిర్మాణ సంస్థలు చాలా అరుదుగా ఉన్నాయి.