నైజాంలో మైత్రీ టార్గెట్ ఏంటి? ఫార్ములా మారుతుందా?
దీంతో నైజాం మార్కెట్ లో సంస్థల మధ్య పోటీ కొత్త ఫార్ములాతో వెళ్తున్నట్టు కనిపిస్తోంది.
By: M Prashanth | 27 Sept 2026 5:00 AM ISTనైజాం మార్కెట్ లో మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ పేరు కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తోంది. పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ కొత్త కాదు. కానీ వరుసగా భారీ సినిమాలపై మైత్రీ చూపిస్తున్న ఇంట్రెస్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో నైజాం మార్కెట్ లో సంస్థల మధ్య పోటీ కొత్త ఫార్ములాతో వెళ్తున్నట్టు కనిపిస్తోంది.
సాధారణంగా ఓ పెద్ద సినిమా వస్తే దాని హీరో మార్కెట్, దర్శకుడి గత సినిమాలు, హైప్, రిలీజ్ టైమ్ ఆధారంగా రేటు నిర్ణయిస్తారు. డిస్ట్రిబ్యూటర్లు ఆ లెక్కల ప్రకారం రైట్స్ తీసుకుంటారు. ఇప్పుడు మాత్రం ఒక సినిమాతో ఆగకుండా వరుస పెద్ద సినిమాలను మార్కెట్ లోకి తీసుకురావడంపై దృష్టి పెరుగుతోంది. మైత్రీ విషయంలో కూడా ఇదే కనిపిస్తోంది.
ది ప్యారడైజ్ తో పాటు రాబోయే భారీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ లో కూడా మైత్రీ యాక్టివ్ గా ఉంది. ఒక్కో సినిమాకు ఒక్కో రేంజ్ క్రేజ్ ఉన్నా.. వాటిని వరుసగా తీసుకోవడం ద్వారా నైజాంలో తమ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చుకోవాలనే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే విషయం కాదు. పెద్ద సినిమాల హక్కులు దక్కితే థియేటర్లతో రిలేషన్స్ పెరుగుతాయి. ఎగ్జిబిటర్లతో మంచి నెట్ వర్క్ ఏర్పడుతుంది.
మార్కెట్ లో సంస్థకు గుర్తింపు కూడా పెరుగుతుంది. అందుకే పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు కేవలం సినిమా బిజినెస్ గా కాకుండా.. మార్కెట్ లో ప్లేస్ పెంచుకునే స్ట్రాటజీగా మారుతోంది. ఇదే సమయంలో నైజాం బిగ్ మూవీ ఫార్ములాలో కూడా ఛేంజ్ కనిపిస్తోంది. గతంలో ఓ పెద్ద సినిమా హక్కులు తీసుకుని.. ఆ సినిమా వసూళ్లతో ఇన్వెస్ట్మెంట్ రికవర్ చేయడం మెయిన్ లెక్క.
ఇప్పుడు వరుసగా వచ్చే సినిమాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే మార్కెట్ ను ప్లాన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక నెలలోనే పలు భారీ సినిమాలు వస్తే థియేటర్ల కేటాయింపు కీలకంగా మారుతుంది. షోలు, స్క్రీన్లు, ఓపెనింగ్స్ విషయంలో ప్రతి సినిమాకు పోటీ ఉంటుంది. ఒక మూవీ టాక్ మరో సినిమాపై కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు రిలీజ్ టైమింగ్ కూడా మెయిన్ ఎలిమెంట్ గా మారుతోంది.
ఇక భారీ రేటుకు సినిమా తీసుకుంటే, ఆ మూవీ బాగా ఆడితే ఇన్వెస్ట్మెంట్ త్వరగా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. టాక్ అంచనాలకు తగ్గకపోతే రికవరీకి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే స్టార్ హీరో సినిమా అనే క్రేజ్ తో పాటు మార్కెట్ పరిస్థితిని కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వస్తోంది. అలా నైజాం మార్కెట్ లో కాంపిటేషన్ ఇప్పుడు ఒక్కో సినిమా కోసం మాత్రమే కాదు. వరుస పెద్ద చిత్రాలతో మార్కెట్ లో తమ ప్లేస్ పెంచుకోవడం వైపు అడుగులు పడుతున్నాయి. మైత్రీ స్పీడ్ కూడా మారుతున్న ట్రెండ్ లో భాగంగానే కనిపిస్తోంది.
