కల్కిలో కర్ణుడు..రామాయణలో రావణుడు!
పురాణాల్లోని కథలని, అందులోని పాత్రలని మార్చి వెండితెరపై ఆవిష్కరిస్తున్న సంస్కృతి నానాటికి ఎక్కువవుతోందా? అంటే ఆవుననే సమాధానం వినిపిస్తోంది.
By: Ravindar Gorantla | 17 April 2026 5:00 PM ISTపురాణాల్లోని కథలని, అందులోని పాత్రలని మార్చి వెండితెరపై ఆవిష్కరిస్తున్న సంస్కృతి నానాటికి ఎక్కువవుతోందా? అంటే ఆవుననే సమాధానం వినిపిస్తోంది. విలన్‌లని హీరోలుగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లకు పాజిటివిటీని ఆపాదించి వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఓ క్యారెక్టర్‌ని వెండితెరపై హీరోని చేసి వీరుడు శూరుడు అంటూ కీర్తించారనే కామెంట్‌లు వినిపించిన నేపథ్యంలో మరో నెగెటివ్ క్యారెక్టర్‌ని పాజిటివ్‌గా ప్రజెంట్ చేస్తుండటంతో మరో వివాదానికి తెరలేపుతున్నారనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన భారీ ఫిక్షనల్ సైన్‌టిఫిక్ మూవీ `కల్కి 2898ఏడీ`. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, సేతుపతి నటించారు. విజయ్ దేవరకొండ అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించగా, కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని నిలువరిస్తూ అశ్వద్ధామకు అండగా నిలిచే కర్ణుడిగా ప్రభాస్‌ని చూపించిన విషయం తెలిసిందే. బౌంటీ హంటర్‌గా, కర్ణుడిగా ప్రభాస్ కనిపించారు. అయితే కర్ణుడిగా కనిపించే క్రమంలో వీర శూరా అంటూ క్యారెక్టర్‌కు హైప్ ఇవ్వడం, మహాభరతంలో తనకు మించిన వీరులు లేరని చెప్పడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
కర్ణుడిని హీరోని చేయడం ఏంటని అంతా కామెంట్‌లు చేశారు. పాటల రచయిత అనంత్ శ్రీరామ్ అయితే దీనిపై విభేదించారు. కర్ణుడిని ఎలా హీరోగా ప్రజెంట్ చేస్తారని ఫైర్ అయ్యారు. ఇప్పటికీ తాను ఇదే కామెంట్‌లకు కట్టుబడి ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. దీంతో కర్ణుడి చుట్టూ వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రామాయణతో మరో వివాదానికి టీమ్ తెరలేపుతున్నట్టుగా కనిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో రావణ పాత్ర పోషిస్తున్న యష్ చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశంగా మారుతున్నాయి. హాలీవుడ్ మీడియా `ఫాండాంగో`కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యష్ రావణ క్యారెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రావణుడిని తాను కేవలం విలన్‌గా చూడటం లేదని స్పష్టం చేశారు. ఇదే ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపుతోంది. రావణుడు ఎంతో లోతైన, క్లిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వాడని, ఒక రాజుగా తన నమ్మకాలు, సిద్దాంతాల మేరకు అతను నిర్ణయాలు తీసుకుంటాడని యఫ్ అభిప్రాయపడ్డారు.
యుద్ద వీరుడిగానే కాకుండా గొప్ప పండితుడిగా, సంగీత విద్వాంసుడిగా, పరమశివుడి భక్తుడిగా రావణుడికున్న ఇతర కోణాలను కూడా ఇందులో చూపిస్తున్నామన్నారు. అయితే యష్ వ్యాఖ్యలపై చాలా మంది ఫైర్ అవుతున్నారు. మీరు రాముడి కథ తీస్తున్నారా? రావణుడి గొప్పదనాన్ని చెప్పే కథ తీస్తున్నారా? అని మండిపడుతున్నారు. దీంతో రామయణ రిలీజ్‌కు ముందే వివాదంగా మారుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
