బాలయ్య వారసుడు మళ్లీ ఊసేలేదే!
నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఆ మధ్య ప్రచారం ఏ రేంజ్ లో జరిగిందో తెలిసిందే.
By: Srikanth Kontham | 3 Nov 2025 4:00 AM ISTనటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఆ మధ్య ప్రచారం ఏ రేంజ్ లో జరిగిందో తెలిసిందే. ఆ ఊపు చూసి మోక్షజ్ఞ ఎంట్రీ లాంఛనమే అనుకున్నారంతా. విదేశాల్లో శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి రావడం...ఇక్కడ బాలయ్య దర్శకుల ప్రయత్నాలు...సొంతంగా కుమారుడి కోసం తానే స్టోరీ రాసారనే ప్రచారం ఈ తరహా హడావుడి చూసి? నందమూరి అభిమానులు ఖుషీ అయ్యారు. మా బాలయ్య బాబు కొడుకొస్తున్నాడని సంబరాలు చేసుకున్నారు.
నటుడిగానా? రాజకీయ నాయకుడిగానా
2025 ముగింపు లేదా? కొత్త ఏడాది 2026 లోనైనా లాంచింగ్ గ్యారెంటీ అనుకున్నారు? కానీ ఇదంతా ప్రచారం తప్ప ఏమీ లేదని తాజాగా క్లారిటీ వచ్చేసింది. మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో జరిగిందంతా ఇదిగో పులి..అదిగో తోక అన్న ప్రచారం తప్ప ఏమీలేదు. బ్యాకెండ్ లో పనులు జరుగుతున్నా నందమూరి ఫ్యామిలీ ఎందుకనో ఎంట్రీ విషయంలో చాలా విషయాలు ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడిని నటుడిని చేయాలా? రాజకీయాల్లోకి తీసుకొచ్చి తాత వారసత్వాన్ని కొనసాగించాలా? అన్న చర్చ కూడా కుటుంబంలో జరిగినట్లు తాజాగా వార్త లొస్తున్నాయి.
బాలయ్య వారసుడు భిన్నంగా:
ఈ కారణంగానే మోక్షజ్ఞ సినిమా లాంచింగ్ విషయంలో డైలమాలో పడినట్లు ఓ వార్త వినిపిస్తుంది. అవన్నీ పక్కన బెడితే? మోక్షజ్ఞ కి ఇప్పటికే 31 ఏళ్లు నిండాయి. హీరోగా 21 ఏళ్లకే చాలా మంది వారసులు ఎంట్రీ ఇచ్చేసారు. ఇంట ర్మీడియట్ అయిన వెంటనే డిగ్రీ వయసు కాబట్టి? అదే సరైన సమయంగా భావించి చాలా మంది స్టార్లు స్టడీస్ లో ఉండగానే లాంచ్ అయ్యారు. సక్సెస్ అవ్వడంతో చాలా మంది స్టార్లు డిగ్రీలు కూడా సంపాదించలేకపోయారు. కానీ మోక్షజ్ఞ అలా కాదు. మంచి తెలివైన వాడు. బాగా చదువుకున్నాడు.
అఖండ 2 ప్రీ రిలీజ్ లో:
కానీ నటుడిగా తెరంగేట్రం చేయాల్సిన వయసులనే చేయలేదు. నందమూరి అభిమానుల్లో అదో అసంతృప్తిగా మిగిలిపోయింది. మరి అభిమానుల కోరిక మేరకు వచ్చే ఏడాది అయినా లాంచ్ చేస్తారా? లేక అతడి కెరీర్ ని మరో రకంగా ప్లాన్ చేస్తున్నారా? అన్నది చూడాలి. ప్రస్తుతం మోక్షజ్ఞ మాత్రం హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. అప్పుడ ప్పుడు డాడ్ సినిమా ఈవెంట్లలో కనిపిస్తుంటాడు. `అఖండ 2` రిలీజ్ నేపథ్యంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించే అవకాశం ఉంది. అదే సందర్భంగా ఏదైనా కొత్త కబురు వినిపించే అవకాశం లేకపోలేదు.
