శివ కార్తికేయన్ మదరాసి.. భయపెట్టిస్తున్న ఆ విషయం..!
మురుగదాస్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా శివ కార్తికేయన్ రేంజ్ మరింత పెంచేస్తుందని అనుకుంటున్నారు.
By: Ramesh Boddu | 29 Aug 2025 1:00 PM ISTఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా సౌత్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ తో కూడా సినిమాలు చేశాడు డైరెక్టర్ మురుగదాస్. తమిళ్ లో స్టార్స్ తో చేసి ఆ క్రేజ్ తో హిందీ ఛాన్స్ లు అందుకున్నాడు. ఇక తెలుగులో కూడా చిరంజీవి, మహేష్ లాంటి స్టార్స్ ని డైరెక్ట్ చేశాడు. ఐతే ఈమధ్య ఆయన అంత ఫాం లో లేడన్న విషయం తెలిసిందే. దర్బార్, సర్కార్ సినిమాలు ఆయనకు ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. అందుకే ఈసారి పక్కా సూపర్ హిట్ కథతో రావాలని గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే శివ కార్తికేయన్ తో మదరాసి సినిమా చేశాడు మురుగదాస్.
167 మినిట్స్ రన్ టైం..
మురుగదాస్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా శివ కార్తికేయన్ రేంజ్ మరింత పెంచేస్తుందని అనుకుంటున్నారు. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న మదరాసి సినిమా రన్ టైం విషయంలో ఫ్యాన్స్ కి భయం పట్టుకుంది. ఈ సినిమా రన్ టైం మొత్తం 167 మినిట్స్ అని తెలుస్తుంది. అంటే రెండు గంటల 47 నిమిషాలు అన్నమాట. ఈమధ్య స్టార్ సినిమాలకు ఈ రన్ టైం హెడేక్ గా మారింది.
సినిమా సక్సెస్ ని కొన్నిసార్లు ఈ రన్ టైం కూడా డిసైడ్ చేస్తుంది. అప్పటిదాకా బాగుంది అనుకున్న సినిమా అనవసరమైన ల్యాగింగ్ తో సినిమా ట్రాక్ తప్పుతుంది. ఐతే మదరాసి సినిమా రన్ టైం 2 గంటల 47 నిమిషాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టదని అంటున్నారు. మురుగదాస్ కూడా ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. అందుకే సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.
సప్త సాగరాలు బ్యూటీ రుక్మిణి వసంత్..
శివ కార్తికేయన్ మదరాసి సినిమాలో సప్త సాగరాలు బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్ లో ఎన్. శ్రీలక్ష్మి ప్రసాద్ నిర్మించారు. మదరాసికి అనిరుద్ అందించిన మ్యూజిక్ కూడా స్పెషల్ క్రేజ్ తీసుకొస్తుంది. సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంచనాలు పెంచగా అమరన్ తర్వాత శివ కార్తికేయన్ నుంచి వస్తున్న ఈ మూవీ ఆ రేంజ్ హిట్ అందుకుంటుందా లేదా అన్న డిస్కషన్ నడుస్తుంది. మరి శివ కార్తికేయ తో అయినా మురుగదాస్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
శివ కార్తికేయన్ ఈమధ్య వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు కాబట్టి అదే ఫాం కొనసాగిస్తే మాత్రం సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. ఈ సినిమాను తెలుగులో కూడా సెప్టెంబర్ 5నే తెస్తున్నారు. ఐతే తెలుగు ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టలేదు.
