ఆ హీరో మురగదాస్ చేతులు కట్టేసాడా?
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగదాస్ తెరకెక్కించిన `సికిందర్` భారీ అంచనాల మద్య విడుదలై డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 18 Aug 2025 3:00 PM ISTసల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగదాస్ తెరకెక్కించిన 'సికిందర్' భారీ అంచనాల మద్య విడుదలై డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ప్రాజెక్ట్ కాల క్రమంలో నెగిటివ్ ఇంపాక్ట్ పడటం..రిలీజ్ అనంతరం తొలి షోతోనే ప్లాప్ టాక్ రావడంతో? సన్నివేశం మొత్తం మారిపోయింది. ఈనేపథ్యంలో హీరో కంటే మురగదాస్ నెటి జనులకు టార్గెట్ అయ్యారు. ప్లాప్ కి కారణంగా మురగదాస్ విమర్శలు ఎదుర్కున్నాడు. అయితే వాటిపై ఏనాడు మురగదాస్ స్పందించలేదు.
కథనే మార్చేసారా:
సినిమా అన్నాక జయాపజయాలు సహజం. విమర్శలు అంతే సహజం వాటిని ఎవరూ అంత సీరియస్ గానూ తీసుకోరు. అయితే `సికిందర్` ప్లాప్ విషయంలో తనకెంత మాత్రం సంబంధం లేదని తాజాగా మురగ దాస్ బాంబ్ పేల్చారు. `సికిందర్` ప్లాప్ కు తానెంత మాత్రం కారణం కాదన్నారు. తాను మొదట రాసిన కథ వేరు అని ముంబైకి చేరిన తర్వాత కథ మొత్తం మారిపోయిందన్నారు.
నాకు సంబంధం లేని విషయం:
'సికిందర్' నా హృదయానికి దగ్గరైన కథ. కానీ చిత్రాన్ని అనుకున్న విధంగా తీయలేకపోయాను. కానీ ప్లాప్ కు మాత్రం నేను బాధ్యత వహించను. బాలీవుడ్ లో 'గజినీ' రీమేక్ చేసాను. అక్కడా బాగా ఆడింది. `సికిందర్` స్ట్రెయిట్ సినిమా. కానీ ముంబైలో నాకు కమాడింగ్ యూనిట్ లేదు. నేను అనుకున్న కథను మార్చేసారు. కొన్ని కారణాల వల్ల నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. అందుకే 'సికిందర్' ప్లాప్ కు నేను బాధ్యత తీసుకోవడం లేదు. అది నాకు సంబంధం లేన విషయంగానే ఎవరడిగినా స్పందిస్తాను` అని అన్నారు.
నో ఛాన్స్ అంటోన్న నయా మేకర్:
సాధారణంగా ట్యాలెంటెడ్ డైరెక్టర్లు ఎవరైనా ప్లాప్ కు తమదే బాధ్యత తీసుకుంటారు. హీరోలను భాగ స్వామ్యం చేయరు. ఆ మధ్య భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన 'థగ్ లైఫ్' రిలీజ్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్లాప్ తన కారణంగానే ప్లాప్ అయిందని మణిరత్నం అభిమానులకు క్షమాపణలు కోరారు. వరుస పరాజయాల నేపథ్యంలో శంకర్ కూడా తన విధానం మార్చుకోవాలన్నట్లు స్పందించారు. కానీ మురగదాస్ సికిందర్ ప్లాప్ ను అంగీకరించకుండా అందుకు విలువైన కారణాల్ని తెలియజేయడం ఆసక్తికరం.
