ఆ డైరెక్టర్ల లిస్టులోకి మురుగదాస్ కూడా!
తమిళ సినిమాలకు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఏ సినిమా అయినా సరే కాస్త బావుందనగానే తెలుగు ఆడియన్స్ ఆ సినిమాలను చూస్తూ ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 6 Sept 2025 2:00 PM ISTతమిళ సినిమాలకు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఏ సినిమా అయినా సరే కాస్త బావుందనగానే తెలుగు ఆడియన్స్ ఆ సినిమాలను చూస్తూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే వస్తుంది. తమిళం నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్లు అయిన సందర్భాలున్నాయి. అయితే కొంత కాలంగా తమిళ ఇండస్ట్రీ నుంచి సరైన సినిమాలు రావడం లేదు.
ఆకట్టుకోలేకపోతున్న తమిళ డైరెక్టర్లు
ఈ ఇయర్ ఇప్పటికే కొందరు డైరెక్టర్లు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, వారి నుంచి వచ్చిన సినిమాలన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకోకపోగా ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో మణిరత్నం, కార్తీక్ సుబ్బరాజ్, శంకర్ లాంటి డైరెక్టర్లు ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోతున్నారని, వారంతా అవుట్‌డేటెడ్ అయిపోయారని నెటిజన్లు అభిప్రాయపడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
లిస్టులోకి మురుగదాస్
అయితే ఇప్పుడా లిస్టులోకి మరో డైరెక్టర్ కూడా చేరారు. అతనే మురుగదాస్. ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన మురుగదాస్ కు గత కొన్ని సినిమాలుగా హిట్ అనేదే దక్కలేదు. మొన్నా మధ్య బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో సికందర్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు తాజాగా శివ కార్తికేయన్ హీరోగా మదరాసి సినిమా చేశారు.
మిక్డ్స్ టాక్ తో మదరాసి
సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మదరాసి సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ టాక్ వస్తోంది. ఈ సినిమాకు ముందు నుంచీ పెద్దగా బజ్ లేకపోయినా, అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నా, రిలీజ్ తర్వాత టాక్ తో బుకింగ్స్ పెరుగుతాయని, మదరాసి సినిమా మురుగదాస్ కు మంచి కంబ్యాక్ సినిమా అవుతుందని ఎంతోమంది ఆశించారు.
బ్రేక్ ఈవెన్ కష్టమే
కానీ వారి ఆశలపై మురుగదాస్ మరోసారి నీళ్లు చల్లారు. మదరాసి కథాంశం కొత్తగా ఉన్నప్పటికీ అందులోని లవ్ ట్రాక్, సెకండాఫ్ బాలేదని, సినిమాను చూడలేమని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. తెలుగులో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆల్మోస్ట్ వాష్ అవుట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ మూవీ కాస్త స్ట్రాంగ్ గానే ఉంది. అమరన్ తర్వాత శివ కార్తికేయన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆ ఎఫెక్ట్ కొంచెం మదరాసిపై చూపించి బుకింగ్స్ ఫర్వాలేదనిపిస్తున్నాయి. తమిళ్ లో మదరాసికి మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా మంచి రన్ ను కంటిన్యూ చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఏదేమైనా మురుగదాస్ మరోసారి ఫ్యాన్స్ ను మాత్రం నిరాశ పరిచారు. ఇలాంటి టాక్ తో మదరాసి బ్రేక్ ఈవెన్ అవడం కూడా కష్టమే.
