Begin typing your search above and press return to search.

మురుగదాస్ కామెంట్స్.. రియాక్షన్ ఎలా ఉంది?

అయితే కొంతకాలంగా ఆయన సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వివిధ సినిమాలు చేసినా.. వాటితో రిజల్ట్ ను అనుకున్నట్లు సాధించలేకపోతున్నారు.

By:  M Prashanth   |   18 Aug 2025 3:02 PM IST
మురుగదాస్ కామెంట్స్.. రియాక్షన్ ఎలా ఉంది?
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ గురించి అందరికీ తెలిసిందే. గజినీ మూవీతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మూవీ స్టాలిన్ తో టాలీవుడ్ లోకి వచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన రూపొందిస్తున్న ప్రతి మూవీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుంది.

అయితే కొంతకాలంగా ఆయన సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వివిధ సినిమాలు చేసినా.. వాటితో రిజల్ట్ ను అనుకున్నట్లు సాధించలేకపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్స్ చవిచూస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ తో మళ్లీ నిరాశపరిచారు. ఇప్పుడు మంచి హిట్ కొట్టాలని టార్గెట్ తో మదరాసి సినిమా చేస్తున్నారు డైరెక్టర్ మురుగదాస్.

అదే సమయంలో ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను తెలుగు సినీ ప్రియులు తిప్పి కొడుతున్నారు. అలా అనడం అసలు కరెక్ట్ కాదని చెబుతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు వేరే రేంజ్ లో ఉందని అంటున్నారు. రూ.1000 కోట్ల క్లబ్ లో టాలీవుడ్ సినిమాలే ఎక్కువ ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే? మురుగదాస్ ఏమన్నారంటే?

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బాక్సాఫీస్ వద్ద భారతీయుడు 2, గేమ్‌ ఛేంజర్‌, థగ్‌ లైఫ్‌ సినిమాల రిజల్ట్ ను ప్రస్తావించారు మురుగదాస్. మణిరత్నం, శంకర్ గొప్ప దర్శకులని, వాళ్లని సాధారణ కమర్షియల్ డైరెక్టర్లుగా భావించకూడదని తెలిపారు. ఇండియాలో ఏ భాషలో అయినా కమర్షియల్ డైరెక్టర్స్ కూడా శంకర్ లా సినిమాల ద్వారా మెసేజ్ ఇవ్వలేరని చెప్పుకొచ్చారు.

అన్ని భాషలు తీసుకుంటే.. తమిళ దర్శకులు మాత్రమే బాక్సాఫీస్ వద్ద గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారని అన్నారు డైరెక్టర్ మురుగదాస్. ఇతర అన్ని భాషల్లో రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టే దర్శకులు కూడా ప్రేక్షకులకు కేవలం వినోదం మాత్రమే అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమిళ డైరెక్టర్స్ మాత్రం జనాల్ని ఎడ్యుకేట్‌ చేస్తారని అభిప్రాయపడ్డారు.

సినీ ప్రియులంతా ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు అనే దానిపై ప్రజలకు ఎప్పుడూ అవగాహన కల్పిస్తారని అన్నారు. దీంతో మురుగదాస్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా రెస్పాండ్ అవుతున్నారు. రూ.1000 కోట్ల టార్గెట్ తో ఇప్పటికే రిలీజ్ అయిన కోలీవుడ్ సినిమాలు ఎలాంటి మెసేజ్ ఇచ్చాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క తమిళ సినిమా కూడా రూ.1000 కోట్ల మార్క్ ను రీచ్ అవ్వలేదని అంటున్నారు.