Begin typing your search above and press return to search.

మురారీ క్లైమాక్స్ సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్!

ఈ క్రమంలోనే మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలవడమే కాకుండా మహేష్ బాబును బెస్ట్ పెర్ఫార్మర్ గా నిలబెట్టిన చిత్రం మురారీ. ఈ సినిమా ఈనెల 31వ తేదీన రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

By:  Madhu Reddy   |   27 Dec 2025 11:27 AM IST
మురారీ క్లైమాక్స్ సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మహేష్ బాబు. తన తండ్రితో కలిసి పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత హీరోగా అవతరించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా గుంటూరు కారం చిత్రం వరకు తెలుగులోనే సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న మహేష్ బాబు.. తొలిసారి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఏకంగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఈ ఒక్క సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు.

ప్రస్తుతం రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్నారు. పైగా ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం . ఇకపోతే ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో అభిమానులు ఈయన కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ.. వాటితో సరిపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలవడమే కాకుండా మహేష్ బాబును బెస్ట్ పెర్ఫార్మర్ గా నిలబెట్టిన చిత్రం మురారీ. ఈ సినిమా ఈనెల 31వ తేదీన రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ తన ఎక్స్ వేదికగా మురారీ క్లైమాక్స్ సీక్రెట్ ను రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సినిమా క్లైమాక్స్ లో హీరో మృత్యువుకి దగ్గరవడం.. మరోవైపు శబరిని , కుటుంబ సభ్యులను ఓదార్చడం, ఇలా ఎన్నో కోణాలతో నిండిన ఆ సన్నివేశంలో మహేష్ బాబు కోసం హోమం చేసే సీన్ క్లైమాక్స్ కే హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ హోమంపై కృష్ణవంశీ స్పందిస్తూ.." ఈ సన్నివేశం కోసం నిజమైన వేద పండితులనే పిలిపించి, మురారి కోసం కాకుండా మహేష్ బాబు పేరు మీదనే ఈ హోమం చేయించాము. మూడు గంటల పాటు నిష్టగా ఈ హోమం జరిగింది. ఈ హోమం జరుగుతుండగా అక్కడక్కడ కొన్ని షాట్స్ తీశాము. చివర్లో పూర్ణాహుతిని మహేష్ బాబు చేస్తున్నప్పుడు.. దానినే సినిమాలో కూడా చూపించారు.. అలా దానిని సినిమా ద్వారా ప్రేక్షకులు కూడా చూశారు" అంటూ తెలిపారు కృష్ణవంశీ.

సంకల్పం గురించి మహేష్ డైలాగ్ చెప్పే నటుడిగా తనకు.. దర్శకుడిగా నాకు పెద్ద ఛాలెంజ్గా అనిపించింది అంటూ తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు నిజంగానే ఆ హోమం చేశారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈ సినిమా విడుదలైన 24 సంవత్సరాల తర్వాత కృష్ణవంశీ ఆ క్లైమాక్స్ సీన్ సీక్రెట్ రివీల్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇది తెలిసిన ఫ్యాన్స్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు దాచారు అని కూడా అడుగుతూ ఉండడం గమనార్హం.