నిర్మాతలకు అండగా నిలిచిన హీరో.. స్టార్ హీరో పై మురళీ మోహన్ ప్రశంసలు
నటుడు, నిర్మాత మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ మంచితనం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిర్మాతలు నష్టపోతే వారిని ఇంటికి పిలిచి ధైర్యం చెప్పేవారని, నష్టాన్ని భర్తీ చేసేందుకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చేవారని తెలిపారు. డబ్బులు లేకపోయినా సినిమా ప్రారంభించమని భరోసా ఇచ్చేవారని గుర్తుచేసుకున్నారు. కృష్ణ నిజమైన నిర్మాతల హీరో అని మురళీ మోహన్ ప్రశంసించారు.
By: Madhu Reddy | 16 Nov 2026 10:00 AM ISTతెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ, మురళీ మోహన్ గురించి మనందరికీ బాగా తెలుసు. కృష్ణ, శోభన్ బాబు లాంటి పెద్ద హీరోలు ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న టైమ్ లో కొత్త కుర్రాడిగా వచ్చిన మురళీ మోహన్, చాలా తక్కువ టైమ్ లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణతో తనకున్న ఫ్రెండ్ షిప్ గురించి, ఆయన మంచితనం గురించి మురళీ మోహన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.ఆ విశేషాలు చూద్దాం..
హీరోగా, నిర్మాతగా మురళీ మోహన్ జర్నీ:
సినిమాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మురళీ మోహన్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో హిట్ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే, మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా మారారు. చాలా మంచి సినిమాలను మన టాలీవుడ్ కు అందించారు. ఇలా అటు హీరోగా, ఇటు ప్రొడ్యూసర్ గా రెండు వైపులా సక్సెస్ అయ్యారు.
కృష్ణ ఫ్యాన్స్ కొట్టడానికి వచ్చారట:
ఇక ఈ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ ఒక షాకింగ్ విషయం చెప్పారు. ఒకప్పుడు కృష్ణ ఫ్యాన్స్ తనను కొట్టడానికి కూడా వచ్చారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఆ రోజుల్లో హీరోల మధ్య పోటీ, అభిమానుల ఆవేశం ఏ రేంజ్ లో ఉండేదో ఈ ఒక్క మాటతో మనకు అర్థమైపోతుంది.
అసలైన ప్రొడ్యూసర్ల హీరో కృష్ణ:
కృష్ణ వ్యక్తిత్వం గురించి మురళీ మోహన్ చాలా గొప్పగా చెప్పారు. కృష్ణ నిజమైన ప్రొడ్యూసర్ల హీరో అని మెచ్చుకున్నారు. తనతో సినిమా తీసి ఎవరైనా ప్రొడ్యూసర్ నష్టపోతే, కృష్ణ వెంటనే వాళ్ళని ఇంటికి పిలిపించి మాట్లాడేవారట. ఒకేసారి ఓ నిర్మాత సినిమా తీసి కృష్ణ తో నష్టపోయాడు ..అయన మల్లి కనపడలేదు ,ఆయన ఓ సందర్భం ఎదురైతే ఆయనకు ధైర్యం చెప్పి, ఆ లాస్ కవర్ చేయడానికి ఇంకో సినిమా చేస్తానని మాట ఇచ్చేవారట.
డబ్బులు లేకపోయినా సపోర్ట్ చేసేవారు:
ఇంకో సినిమా చేయడానికి తమ దగ్గర డబ్బులు లేవని,కనీసం కొబ్బరికాయ కొట్టటానికి కూడా డబ్బులు లేవని ప్రొడ్యూసర్లు చెప్పినా కృష్ణ అస్సలు వెనక్కి తగ్గేవారు కాదట. "డబ్బుల గురించి టెన్షన్ పడకండి, మీరు ముందు సినిమా స్టార్ట్ చేయండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను" అని భరోసా ఇచ్చేవారట. ప్రొడ్యూసర్ల మంచి కోరుకునే అంత గొప్ప మనసున్న మనిషిని తను ఇంతవరకు చూడలేదని మురళీ మోహన్ ఎమోషనల్ గా చెప్పారు.
సోషల్ మీడియాలో వైరల్ :
ఇప్పుడు మురళీ మోహన్ చెప్పిన ఈ మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కృష్ణ గొప్పతనం గురించి విన్న ఫ్యాన్స్, నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో కేవలం తన గురించి మాత్రమే కాకుండా, తనను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు కూడా బాగుండాలని కోరుకున్న గొప్ప హీరో కృష్ణ. మురళీ మోహన్ చెప్పిన ఈ మాటలు కృష్ణ మంచితనాన్ని మరోసారి అందరికీ గుర్తు చేశాయి.
