మన దగ్గర అలాంటి మల్టీస్టారర్ ఎప్పుడు..?
ఐతే లోకేష్ మీద ఉన్న నమ్మకంతో ఈ కాంబినేషన్స్ సెట్ అయ్యాయి. యాక్టర్స్ అంతా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవ్వాలని ఆసక్తి చూపిస్తున్నారు.
By: Ramesh Boddu | 17 Aug 2025 12:37 PM ISTకూలీ సినిమా చూశాక తెలుగు ఆడియన్స్ అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఎందుకు మన దగ్గర ఇలాంటి మల్టీస్టారర్స్ రావు అని. అఫ్కోర్స్ ఈమధ్య కాస్త బెటరే కానీ అసలు స్టార్ సినిమాల్లో ఇలాంటి కాంబినేషన్ సెట్ చేయడం అంటే డైరెక్టర్స్ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఐతే కోలీవుడ్ లో మాత్రం ఇలా వెరైటీ కాంబినేషన్స్ కుదురుతున్నాయి. కూలీ సినిమాలో రజనీకి విలన్ గా నాగార్జున నటించడం అంటే గొప్ప విషయమని చెప్పొచ్చు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్..
ఐతే లోకేష్ మీద ఉన్న నమ్మకంతో ఈ కాంబినేషన్స్ సెట్ అయ్యాయి. యాక్టర్స్ అంతా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవ్వాలని ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అతను అలాంటివి సెట్ చేస్తున్నాడు. కానీ మన దగ్గర మాత్రం ఇలాంటి కాంబినేషన్స్ కుదరట్లేదు. ఐతే అడపాదడపా మన వాళ్లు కూడా అలాంటి అటెంప్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తాడన్న టాక్ ఉంది. వెంకీ క్యామియో సినిమాలో సర్ ప్రైజ్ చేస్తుందట. అదొక్కటి ఓకే కానీ మన సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎందుకు మల్టీస్టారర్స్ ట్రై చేయట్లేదు అన్న పాయింట్ డిస్కషన్ లోకి వస్తుంది. చిరు, బాలయ్య, నాగ్, వెంకీ ఎవరికి వారికి సెపరేట్ మార్క్ ఉంటుంది. దశాబ్దాలుగా వాళ్లు ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు.
మల్టీస్టారర్ పడితే బాక్సాఫీస్ షేక్..
ఈ కాంబినేషన్ మల్టీస్టారర్ పడితే బాక్సాఫీస్ షేక్ చేయడం కాదు ఇండియన్ బాక్సాఫీస్ పై సరికొత్త వసూళ్ల లెక్కలు సెట్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఆ స్టార్స్ కూడా కలిసి చేయడానికి రెడీనే కానీ అందుకు తగిన కథ సెట్ అవ్వట్లేదు. అందుకే వారు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. నాగార్జున ఎప్పుడు కూడా మల్టీస్టారర్ కు రెడీ అంటాడు. వెంకటేష్ ఆల్రెడీ మల్టీస్టారర్స్ చేస్తూనే ఉన్నాడు. చిరంజీవి, బాలకృష్ణ కూడా కథ డిమాండ్ చేస్తే వాళ్లు ఓకే అనేస్తారు. తప్పకుండా త్వరలోనే ఒక మెగా మాస్ మల్టీస్టారర్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుందనిపిస్తుంది. మరి అది ఎవరు ఎప్పుడు ఎలా మొదలు పెడతారన్నది చూడాలి.
కూలీ లాంటి కథలు మన దగ్గర వస్తాయి. కానీ అవి వచ్చినప్పుడు మన స్టార్స్ వాటిని రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఫ్యాన్ ఫీస్ట్ మూవీస్ గా కాంబినేషన్ కుదిరేలా చేస్తే మాత్రం అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంటుంది.
