Begin typing your search above and press return to search.

గట్టిగా దొరికేసా.. ట్రోల్స్ పై అనిల్ రావిపూడి రియాక్షన్

సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

By:  M Prashanth   |   14 Jan 2026 11:58 AM IST
గట్టిగా దొరికేసా.. ట్రోల్స్ పై అనిల్ రావిపూడి రియాక్షన్
X

సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, పండుగ విన్నర్ గా నిలిచేలా కనిపిస్తోంది. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా సినిమాల మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తుంటాయి. మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి సినిమాలపై మీమ్స్, ట్రోల్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో గత 15 రోజులుగా తనపై జరుగుతున్న చర్చను అనిల్ చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. కేవలం సినిమాలను హిట్ చేయడమే కాకుండా, తనపై వచ్చే విమర్శలను కూడా అంతే స్పోర్టివ్ గా తీసుకోవడం ఈ దర్శకుడి ప్రత్యేకత అని మరోసారి నిరూపించుకున్నారు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ట్రోల్స్ పై అనిల్ నవ్వుతూనే స్పందించారు. "గత 15 రోజులుగా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో జరిగిన విధ్వంసం మామూలు విషయం కాదు.. దొరుకుతాడా? దొరకడా? అని చాలా రకాలుగా మాట్లాడుకున్నారు" అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ ట్రోల్స్ అన్నింటికీ బాక్సాఫీస్ రిజల్ట్ తోనే సమాధానం దొరికిందన్నట్లుగా ఆయన తన మాటల్లో వ్యక్తపరిచారు.

"సోషల్ మీడియాలో దొరుకుతాడా దొరకడా అన్నారు.. గట్టిగా దొరికేసా.. ఎవరికి దొరికాను? ప్రేక్షకులకు దొరికాను" అంటూ అనిల్ తనదైన శైలిలో స్వీట్ కౌంటర్ ఇచ్చారు. ప్రేక్షకులు టికెట్ కొని థియేటర్లకు వచ్చి ఈ సినిమాలో చిరంజీవి గారిని చూసి సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే తన మీద వచ్చే ట్రోల్స్ అన్నీ మర్చిపోతానని ఆయన వెల్లడించారు. నవ్వుతూనే విమర్శకులకు తన సక్సెస్‌తో సమాధానం చెప్పారు.

తనను విమర్శించే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, "నన్ను వేసుకునే వాళ్ళు వేసుకోండి.. పొగిడే వాళ్ళు పొగుడుకోండి.. నేను మాత్రం మీ మీమ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తాను" అని అనిల్ పేర్కొన్నారు. బుక్ మై షో లో ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం అనేది మెగాస్టార్ మ్యాజిక్ అని, బాస్ ను అలా వింటేజ్ లుక్ లో చూపించడం తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

'మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ మెగాస్టార్ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ దిశగా వెళ్తోంది. అనిల్ రావిపూడి తన 100% సక్సెస్ రికార్డ్‌ను పదిలపరుచుకోవడమే కాకుండా, తనపై వచ్చే ట్రోల్స్ కి బాక్సాఫీస్ నంబర్లతోనే క్లారిటీ ఇచ్చారు. పండుగ సెలవుల మూడ్ లో ఉన్న ఆడియన్స్ కు ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఇక సినిమా ఫైనల్ లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.