ఒకే మిషన్.. ఇద్దరు ఫైటర్లు..ఇద్దరిలో సత్తా చాటేదెవరు?
మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో ఎంత పేరుగాంచారో చెప్పనక్కర్లేదు. ఇండియా తరఫున ఆడిన ఎన్నో మ్యాచుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.
By: Madhu Reddy | 8 Sept 2025 10:01 PM ISTమహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో ఎంత పేరుగాంచారో చెప్పనక్కర్లేదు. ఇండియా తరఫున ఆడిన ఎన్నో మ్యాచుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అయితే అలాంటి ఎం.ఎస్. ధోని తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ నటుడు ఆర్.మాధవన్ మెయిన్ లీడ్ లో చేస్తున్న తాజా ప్రాజెక్టు ఛేజ్.. వాసన్ బాలా డైరెక్షన్లో ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ ఛేజ్ ప్రాజెక్టు లో మాధవన్ మెయిన్ లీడ్ పోషించగా.. ధోని ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా విడుదలైన ఈ ఛేజ్ టీజర్ లో మాధవన్, ధోనీల లుక్ వైరల్ అవుతోంది.
విడుదలైన ఈ టీజర్ లో మాధవన్ ఒక గూఢచారి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆయన ఒక క్లిష్టమైనటువంటి కేసును ఛేదించడంలో నిమగ్నమైనట్టు చూపించారు. అలాగే వీరిద్దరూ బ్లాక్ కలర్ గేర్ బుల్లెట్ ప్రూఫ్ షర్ట్స్, సన్ గ్లాసెస్ పెట్టుకున్న లుక్ లో కనిపించారు.ఇక విడుదలైన ఈ టీజర్ లో ఎన్నో యాక్షన్ సన్నివేశాలను చూపించారు.. ఆసక్తికరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన ఈ టీజర్ చూసే ప్రేక్షకులను కట్టి పడేస్తోంది.. అయితే ధోని, మాధవన్ కాంబినేషన్లో వచ్చే ఈ ప్రాజెక్టు వెబ్ సిరీసా..లేక సినిమానా.. లేదా ఏదైనా స్పెషల్ ప్రాజెక్టా అనేది మాత్రం తెలియదు. కానీ విడుదలైన ఈ ఛేజ్ టీజర్ మాత్రం ఎంతోమందిని ఆకట్టుకుంది..
ఇక ఈ టీజర్ ని బట్టి చూస్తే మాధవన్ సమర్థమంతమైన ఏజెంట్ గా పని చేస్తూ ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నట్టు అర్థమవుతుంది.. అలాగే హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు ఈ టీజర్ కి ఆకర్షితులవుతున్నారు. అలాగే చాలామంది సినీ విశ్లేషకులు మాధవన్, ధోని కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్టు అద్భుతంగా ఉండబోతుందని భావిస్తున్నారు.
తాజాగా విడుదలైన ఈ ఛేజ్ టీజర్ గురించి మాధవన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టారు.. " ఒకే మిషన్.. ఇద్దరు ఫైటర్లు.. బకిల్ అప్...ఒక వైల్డ్ ఛేజ్.. ధోనితో కలిసి వర్క్ చేయడం ఒక కలలా ఉంది.అలాగే ఈ ప్రాజెక్టు నా హృదయానికి చాలా దగ్గరయింది.. ఛేజ్ మీ అంచనాలను దాటేస్తుందని నేను ఆశిస్తున్నాను" అంటూ పెట్టారు..
ఛేజ్ టీజర్ గురించి ధోని స్పందిస్తూ.. "మేం కథల ద్వారా ప్రతి ఒక్క ప్రేక్షకుణ్ణి ఆకర్షించాలి అనుకుంటున్నాం.. ఛేజ్ అనేది ఒక పవర్ఫుల్ కథ.. అలాగే మాధవన్ దీన్ని సరైన రీతిలో తెరపైకి తీసుకు వస్తాడని నేను నమ్ముతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.. అయితే ఈ ఛేజ్ ప్రాజెక్టులో ధోని కొద్దిసేపే కనిపిస్తాడా.. లేక కథ మొత్తంలో ఉంటాడా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ధోని నిర్మాణంలో మాధవన్ యాక్షన్ అవతార్ లో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని వీళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.. మరి వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ ఛేజ్ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి. అంతేకాదు ఇద్దరిలో ఎవరు సత్తా చాటనున్నారో తెలియాల్సి ఉంది.
