రేసులో కింగ్‌ని వెనక్కి నెట్టేసిన ఎంఎస్ ధోని
వాణిజ్య ప్రకటనల ప్రపంచంలో ఎం.ఎస్.ధోని ఎప్పుడూ కింగ్ అని నిరూపణ అవుతోంది. ప్రచారకర్తగా ధోని కేవలం ఆరు నెలల్లోనే 43 బ్రాండ్‌లతో చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాడు.
By: Sivaji Kontham | 5 Sept 2025 5:15 AM ISTబ్రాండ్ ప్రచారంలో సినీక్రీడా రంగ ప్రముఖులు ఎప్పుడూ టాప్ 10లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రథమార్థంలో కింగ్ ఖాన్ షారూఖ్ నంబర్ వన్ స్థానంలో నిలవగా, ఇప్పుడు ద్వితీయార్థంలో ఖాన్ ని వెనక్కి నెట్టేసి, క్రికెటర్ ఎం.ఎస్.ధోని అగ్ర స్థానాన్ని అందుకున్నారు. TAM యాడ్ ఎక్స్ టీవీ ప్రకటనల నివేదిక (జనవరి-జూన్) ప్రకారం 2025 ప్రథమార్థంలో భారతీయ టెలివిజన్‌లో అత్యధికంగా కనిపించే రెండవ సెలబ్రిటీగా ఎంఎస్ ధోని నిలిచాడు. మొదటి స్థానంలో భారత మాజీ కెప్టెన్ .. సిఎస్‌కే ఐకాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నిలిచారు. ఈ ఏడాది ప్రథమార్థంలో ధోని తర్వాతే అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ సహా చాలా మంది సినీ ప్రముఖులు, క్రీడా నిపుణులు ఉన్నారు.
వాణిజ్య ప్రకటనల ప్రపంచంలో ఎం.ఎస్.ధోని ఎప్పుడూ కింగ్ అని నిరూపణ అవుతోంది. ప్రచారకర్తగా ధోని కేవలం ఆరు నెలల్లోనే 43 బ్రాండ్‌లతో చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సంఖ్య ఈ ఏడాదిలో అమితాబ్ బచ్చన్ చేసిన మొత్తం ఎండార్స్‌మెంట్‌లను కూడా మించిపోయింది. బ్రాండ్ కౌంట్ పరంగా షారుఖ్ ఖాన్ 35 ఎండార్స్‌మెంట్‌లతో ధోని తర్వాత స్థానంలో నిలవగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 28 ఎండార్స్‌మెంట్‌లతో మూడవ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమణ తర్వాత కూడా ప్రకటనల రంగంలో ధోని ఆధిపత్యానికి ఎదురే లేదని మరోసారి నిరూపణ అవుతోంది.
అంతేకాదు రోజుకు 22గం.ల పాటు ధోని నటించిన ప్రకటనల్ని ప్రజలు వివిధ టీవీ మాధ్యమాల్లో వీక్షిస్తున్నారనే లెక్క ఆశ్చర్యపరుస్తోంది. అన్ని టెలివిజన్ ఛానెల్‌లలో మొత్తం ప్రకటనల సైజ్‌లో సుమారు 7శాతం ఆయన ప్రకటనలే కనిపిస్తున్నాయి. దేశీయ ప్రకటనల మార్కెట్లో అత్యంత ధనికుడిగా ధోని రికార్డులకెక్కారు. విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ టీవీల్లో ఎక్కువ కనిపించే వారి జాబితాలో ఉన్నారు. ద్రవిడ్ ని సగటున రోజువారీగా 6.4 గంటలు ప్రకటనల్లో వీక్షిస్తుండగా, కోహ్లీని 6.3 గంటలు మాత్రమే కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరూ మొత్తం ప్రకటనల పరిమాణంలో దాదాపు 2 శాతం వాటాను కలిగి ఉన్నారు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ 6.8 గంటల రోజువారీ టీవీ ప్రకటనల వీక్షణతో 8వ స్థానంలో ఉన్నారు.
