మృణాల్ కోరుకుంటోన్న కింగ్ ఆఫ్ రొమాన్స్ ఛాన్స్ ఎవరిదో?
మృణాల్ ఠాకూర్ ఇంతవరకూ ఎవరితోనూ ప్రేమలో పడలేదు. రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కథనాలు ఎక్కడా రాలేదు.
By: Srikanth Kontham | 18 Oct 2026 6:00 AM ISTమృణాల్ ఠాకూర్ ఇంతవరకూ ఎవరితోనూ ప్రేమలో పడలేదు. రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కథనాలు ఎక్కడా రాలేదు. అమ్మడు దృష్టి అంతా సినిమాలపైనే ఉంది. అందులోనే తాను నటించే సినిమా ఏదైనా? వినూత్నంగా ఉండాలి. అందులోనూ అమ్మడి పాత్ర రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఉండాలి. వృత్తి పట్ల ఇంత ప్రోఫెషనల్ గా ఉన్న మృణాల్ వ్యక్తిగత జీవితంలో..అందులోనూ జీవిత భాగస్వామి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా...ఫ్యాషనేట్ గా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు.
మరి మృణాల్ మనసు దోచుకునే చెలికాడు ఎవరు? అతడు ఎలా ఉండాలి? అంటే అమ్మడి మాటల్ని బట్టి ఓ క్లారిటీ వస్తుంది. జీవిత భాగస్వామి షారూక్ ఖాన్ సినిమాల్లోని రొమాంటిక్ పాత్రల వలె ఉండాలని.. అప్పుడే తాను ప్రేమకు, పెళ్లికి ఓకే చెబుతానని ఓ కామెంట్ విసిరింది. షారుక్ ఖాన్ అంటే నటుడు మాత్రమే కాదు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హృదయాలలో `కింగ్ ఆఫ్ రొమాన్స్`. షారూక్ ఖాన్ తెరపై కనిపించిన తీరు.. పలికించిన హావభావాలు.. హీరోయిన్లను ప్రేమించే విధానం ఎవరినైనా కట్టిపడేస్తాయి.
`దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే` నుంచి `దిల్ తో పాగల్ హై`, `వీర్-జారా` వరకు షారుక్ పోషించిన ప్రతి రొమాంటిక్ పాత్ర భావోద్వేగ ప్రయాణం. కళ్లతోనే ప్రేమను పలికించడం, చేతులు చాచే సిగ్నేచర్ పోజ్, ప్రియురాలి కోసం ఎంతకైనా వెళ్లే తత్వం ఇవన్నీ షారూక్ పాత్రల ప్రత్యేకత. నేటి మోడరన్ డేట్స్‌లో ఇలాంటి అరుదైన, స్వచ్ఛమైన ప్రేమను కోరుకోవడం లో మృణాల్ ఆలోచనలో ఎంతటి నిజాయితీ ఉందో అర్థమవుతుంది. మృణాల్ ఠాకూర్ సినిమాల్లో అందమైన అభినయంతో పాటు, పాత్రలకు తగ్గ లోతైన ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట.
నిజ జీవితంలో కూడా మృణాల్ రిలేషన్షిప్స్, ప్రేమ పట్ల చాలా క్లారిటీతో ఉన్నారని తెలుస్తోంది. తాత్కాలిక ఆకర్షణల కంటే షారూక్ సినిమాల్లో చూపించే అంకితభావం, నిస్వార్థమైన ప్రేమ, గౌరవం భాగస్వామిలో ఉండాలని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రాక్టికల్ రిలేషన్షిప్స్ పెరుగుతున్న తరుణంలో మృణాల్ ఇప్పటికీ ఆ క్లాసిక్, మ్యాజికల్ లవ్‌ను నమ్మడం విశేషం. బాలీవుడ్ నుంచి సౌత్ సినిమా వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్, సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి సాధారణ అమ్మాయిలా కలల రాకుమారుడి గురించి మాట్లాడటం అభిమానులను ఆకట్టుకుంటోంది.
షారూక్ రొమాన్స్ కేవలం కల్పన కాదని.. అది నిజ జీవితంలో కూడా ఎదుటివారికి ఇచ్చే భద్రతకు, ప్రేమకు ప్రతీక అని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో మారుతున్న సమీకరణాల మధ్య మృణాల్ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అమ్మడి పరిణతికి నిదర్శనం. మరి మృణాల్ కోరుకుంటోన్న ఆ కింగ్ ఆఫ్ రొమాన్స్ వెండి తెర హీరో అవుతాడా? బిజినెస్ మెన్ అవుతాడా? అన్నది విధికే వదిలేయాలి.
