Begin typing your search above and press return to search.

డిసెంబ‌ర్ సెల‌బ్రేష‌న్‌లో మృణాల్-త‌మ‌న్నా

త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో ఎప్పుడూ త‌న అభిమానుల‌ను మెప్పిస్తూనే ఉంది మృణాల్ ఠాకూర్. టాలీవుడ్, బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా వెలిగిపోతోంది.

By:  Sivaji Kontham   |   5 Jan 2026 9:37 AM IST
డిసెంబ‌ర్ సెల‌బ్రేష‌న్‌లో మృణాల్-త‌మ‌న్నా
X

త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో ఎప్పుడూ త‌న అభిమానుల‌ను మెప్పిస్తూనే ఉంది మృణాల్ ఠాకూర్. టాలీవుడ్, బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా వెలిగిపోతోంది. `సీతారామం` సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సీతామహాలక్ష్మిగా స్థిరపడిపోయిన మృణాల్ ఇటీవ‌ల‌ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.




2026లో మృణాల్ ఐదారు చిత్రాల‌తో బిజీ బిజీగా ఉంది. ఈ ఏడాది తెలుగు, హిందీలో ఆసక్తికరమైన లైన‌ప్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అడివి శేష్ స‌ర‌స‌న భారీ యాక్ష‌న్ చిత్రం `డెకాయిట్` లో న‌టిస్తోంది. ఈ చిత్రం 19 మార్చి 2026న విడుద‌ల కానుంది. కొంత గ్యాప్ త‌ర్వాత తెలుగులో `డెకాయిట్` చిత్రంతో స‌త్తా చాటాల‌ని మృణాల్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది. టీజ‌ర్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధిస్తోంది. ఇది ఒక గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామా అని మృణాల్ ఇందులో `జూలియట్` అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. త‌దుప‌రి అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్ (AA 22) లో భాగం కాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని క‌థ‌నాలొచ్చాయి.




అలాగే బాలీవుడ్ లో నాలుగైదు చిత్రాల‌తో బిజీగా ఉంది. సిద్ధాంత్ చ‌తుర్వేది స‌ర‌స‌న `దో దీవానే షెహర్ మే` అనే చిత్రంలో న‌టిస్తోంది. 20 ఫిబ్రవరి 2026న ఈ చిత్రం విడుద‌ల కానుంది. వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న `హై జవానీ తో ఇష్క్ హోనా హై`లో న‌టిస్తోంది. జూన్ 5 విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. `పూజా మేరీ జాన్` అనే హిందీ చిత్రంలో హ్యూమా ఖురేషితో క‌లిసి న‌టిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది విడుద‌ల‌వుతుంది.




స్నేహితురాలు త‌మ‌న్నాతో..

మృణాల్ సోష‌ల్ మీడియాల్లోను ఎంతో యాక్టివ్ గా ఉంది. అక్క‌డ త‌న వ్య‌క్తిగ‌త కుటుంబ జీవితానికి సంబంధించిన చాలా ఫోటోలు, వీడియోల‌ను ఈ బ్యూటీ షేర్ చేస్తోంది. 2025 డిసెంబ‌ర్ లో క్రిస్మ‌స్ వారంతం విదేశాల‌లోని ఎగ్జోటిక్ బీచ్ లొకేష‌న్ లో త‌న కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను మృణాల్ ఇన్ స్టాలో షేర్ చేసింది. త‌న త‌ల్లిదండ్రులు, సోద‌రుడు, ఇత‌ర స్నేహితులు కూడా ఈ ఫోటోల‌లో క‌నిపించారు. త‌న స్నేహితురాలు త‌మ‌న్నా కూడా ఈ ట్రిప్ లో జాయిన్ అయిన ఫోటో ఆల్బ‌మ్ కి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ప్ర‌స్తుతం మృణాల్ వెకేష‌న్ కి సంబంధించిన ఫోటోల‌ను ఫ్యాన్స్ వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. కొత్త సంవ‌త్స‌రంలో కొత్త గోల్స్ తో మృణాల్ దూసుకుపోవాల‌ని విష్ చేస్తున్నారు.

డేటింగ్ లైఫ్‌:

ఇక మృణాల్ ప్ర‌ముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చిన సంగ‌తి తెలిసిందే. అవన్నీ కేవలం పుకార్లేనని, ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని ఈ భామ‌ స్పష్టం చేశారు. కొత్త సంవ‌త్స‌రంలో కొత్త డేటింగ్ గురించి ఏదైనా హింట్ ఇస్తుందేమో చూడాలి.