Begin typing your search above and press return to search.

మృణాల్ ఆశ‌ల‌న్నీ ఆ ప్రాజెక్టు పైనే!

గత కొంతకాలంగా మృణాల్ ఎక్కువగా కమర్షియల్ ఫార్ములా సినిమాల వైపు మొగ్గుచూపినప్పటికీ, అవి ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 July 2026 12:48 AM IST
మృణాల్ ఆశ‌ల‌న్నీ ఆ ప్రాజెక్టు పైనే!
X

మృణాల్ ఠాకూర్ ఇప్పుడు తన కెరీర్‌లో కీలకమైన మలుపు వద్ద నిలిచారు. రీసెంట్ గా బాలీవుడ్ లో ఆమె చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో, కథల ఎంపిక విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. మంచి నటిగా పేరున్నప్పటికీ, కమర్షియల్ స‌క్సెస్‌లు మాత్రం వరుసగా దూరమవుతుండటంతో ఇప్పుడు తన ఇమేజ్‌ను కొత్తగా మలచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి టైమ్ లో మృణాల్ నటించిన పూజా మేరీ జాన్ త్వరలో ఓటీటీ వేదికపై ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమవుతుండటంతో, దీనిపై మృణాల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో డిస్క‌ష‌న్ సాగుతోంది. తాను న‌టించిన సినిమాల‌కు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోలేక‌పోయినా, ఓటీటీలో మంచి రెస్పాన్స్ వ‌స్తే నటిగా త‌న స‌త్తాను మరోసారి నిరూపించుకునే అవకాశం దక్కుతుందని మృణాల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా మృణాల్ ఎక్కువగా కమర్షియల్ ఫార్ములా సినిమాల వైపు మొగ్గుచూపినప్పటికీ, అవి ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో ఇప్పుడు యాక్టింగ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న కథలను ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆడియ‌న్స్ కూడా ఆమె నుంచి గ్లామర్ పాత్రలకంటే ఎమోష‌న్స్, యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలను ఎక్కువగా ఆదరిస్తారని గత అనుభవాలు చెబుతున్నాయి.

పూజా మేరీ జాన్ కూడా అలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ ప్రాజెక్టుగానే ప్రచారం పొందుతోంది. సస్పెన్స్, సైకాలజికల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమాలో మృణాల్ క్యారెక్టు్ క‌థ‌కు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఆమె సాధారణ ఓటీటీ రిలీజ్‌గా కాకుండా, తన కెరీర్‌ను మళ్లీ సరైన దిశలో నడిపించే అవకాశంగా చూస్తున్నార‌ని స‌మాచారం.

ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని, విమర్శకుల ప్రశంసలు అందుకుంటే మృణాల్‌కు కొత్త తరహా అవకాశాలు తెరుచుకునే అవకాశ‌ముంది. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న థ్రిల్లర్లు, లేడీ ఓరియెంటెడ్ స్టోరీస్, పెద్ద ఓటీటీ ఒరిజినల్ ప్రాజెక్టులు, అలాగే స్టార్ హీరోల సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్లు ఆమెకు వచ్చే అవకాశాలు పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మృణాల్‌కు మరో భారీ బాక్సాఫీస్ స‌క్సెస్ కంటే, తనపై ప్రేక్షకుల్లో మరియు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో కొత్త నమ్మకాన్ని పెంచే ఒక బలమైన సినిమానే అత్యంత అవ‌స‌రం. ఆ ప‌రంగా చూస్తే పూజా మేరీ జాన్ రిజ‌ల్ట్ మృణాల్ ఫ్యూచ‌ర్ కెరీర్‌ను ప్రభావితం చేసే కీలక మైలురాయిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.