Begin typing your search above and press return to search.

ముంబై ఎయిర్పోర్టులో మెరిసిన మృణాల్ .. లుక్ అదుర్స్!

ఇందులో సాంప్రదాయంగా చీరకట్టులో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

By:  Madhu Reddy   |   11 Nov 2025 2:00 AM IST
ముంబై ఎయిర్పోర్టులో మెరిసిన మృణాల్ .. లుక్ అదుర్స్!
X

సాధారణంగా మన టాలీవుడ్ తో పోల్చుకుంటే బాలీవుడ్లో సెలబ్రిటీలకు పాపరాజీలు ఉంటారన్న విషయం ఇప్పటికే ప్రియమణి లాంటి ఎంతో మంది హీరోయిన్లు అసలు విషయాన్ని చెప్పి ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా సరే ఈ పాపరాజీలు వెంటపడి మరీ వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి పాపులారిటీ అందించి పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పాపరాజీ లందరూ కూడా పెయిడ్ ఫోటోగ్రాఫర్లు కావడం గమనార్హం.

అయితే మరొకవైపు ఫోటోగ్రాఫర్లే కాదు సామాన్య ప్రజలు కూడా సెలబ్రిటీలు పబ్లిక్ లో కనిపించారు అంటే వారి ఫోటోలు , వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే .ఈ క్రమంలోనే తాజాగా సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ప్రముఖ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.. ఇందులో సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించి అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముంబై ఎయిర్పోర్టులో కనిపించిన మృణాల్ ను చూసి ఆమె ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్లు వెంటపడ్డారు. అలాగే చాలామంది ప్రయాణికులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్యారెట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో చీరకట్టులో చాలా సాంప్రదాయంగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

మృణాల్ ఠాకూర్ విషయానికొస్తే.. హిందీ సీరియల్స్ ద్వారా సినీ కెరియర్ ను ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ.. అలా తొలిసారి ' ముజ్ సే కుచ్ కెహెతి.. ఏ ఖామోషియాన్' అనే హిందీ సీరియల్ ద్వారా నటన రంగంలోకి వచ్చి 2014లో వచ్చిన విట్టి దండు అనే మరాఠీ చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది.. ఆ తర్వాత హిందీ, తెలుగు భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తొలిసారి తెలుగులో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నేరుగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృనాల్ ఠాకూర్ సీత పాత్రలో నటించి తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో సాంప్రదాయంగా చీరకట్టులో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు చిత్రాలు ఇచ్చిన క్రేజ్ తో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అలా హ్యాట్రిక్ అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ప్రస్తుతం అడవి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ అనే సినిమాలో నటిస్తోంది .వాస్తవానికి ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా ఎంపికైంది. కొంత భాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. కానీ పలు కారణాలవల్ల ఆమె తప్పుకోవడంతో ఆ స్థానాన్ని మృణాల్ తో భర్తీ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పైనే అమ్మడి అంచనాలు ఉన్నాయి.