మృణాల్ చేతిలో అదొక్కటే.. రీజన్స్ ఏంటి..?
మృణాల్ ఠాకూర్ డెకాయిట్ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమాలో ఒక రోల్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి
By: Ramesh Boddu | 9 Nov 2025 7:00 PM ISTబాలీవుడ్ లో సీరియల్స్ చేసి ఆ క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ లు అందుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మృణాల్ ఠాకూర్ కి తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది. ఆ నెక్స్ట్ నానితో హాయ్ నాన్న చేసి మెప్పించింది మృణాల్ ఐతే థర్డ్ ప్రయత్నంగా విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. 3 సినిమాలు తీస్తే రెండు హిట్లు ఒక ఫ్లాప్ పడగా అయినా కూడా మృణాల్ కి తెలుగులో సరైన అవకాశాలు రావట్లేదు.
మృణాల్ ఠాకూర్ చేతిలో ఒకే ఒక్క సినిమా..
నిజంగానే మృణాల్ కి ఛాన్స్ లు రావట్లేదా ఒకవేళ వచ్చినా ఆమె కాదంటుందా అన్నది తెలియదు కానీ మృణాల్ ఠాకూర్ చేతిలో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది. అది కూడా ముందు ఒక హీరోయిన్ తో ఆ ప్రాజెక్ట్ అనుకుని టీజర్ కూడా చేశాక మధ్యలో ఆ హీరోయిన్ హ్యాండ్సప్ చెప్పడంతో మృణాల్ కి ఛాన్స్ దక్కింది. ఒకవేళ ఆ హీరోయిన్ కొనసాగి ఉంటే ఆ అవకాశం కూడా ఉండేది కాదు.
మృణాల్ ఠాకూర్ డెకాయిట్ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమాలో ఒక రోల్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి కానీ అది అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఐతే తెలుగులో పరిస్థితి ఇలా ఉండగా ఇంకా బాలీవుడ్ లో మృణాల్ తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్కడ స్టార్ అవ్వాలన్న తన కల కోసం మృణాల్ ఎలాంటి ఆఫర్ వచ్చినా కాదనకుండా చేస్తుంది.
టాలీవుడ్ మీదే మృణాల్ ఫోకస్..
హిందీలో సినిమాలు చేస్తున్నా కూడా తన ఫోకస్ అంతా టాలీవుడ్ మీదే మృణాల్ పెట్టింది. అందుకే ఇక్కడ ఏ సినిమా ఛాన్స్ వచ్చినా కాదనకుండా చేయాలని చూస్తుంది. తెలుగులో చేసిన 3 సినిమాల్లో రెండు సక్సెస్ అయినా కూడా మృణాల్ ఠాకూర్ ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఐతే ఆడియన్స్ మాత్రం మృణాల్ కి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం అడివి శేష్ డెకాయిట్ ఒక్కటే ఆమె చేస్తుండగా ఆ సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా మృణాల్ కి అవకాశాలు వస్తాయేమో చూడాలి.
మృణాల్ మాత్రం తన హోప్స్ ని వదులుకోకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉంది. తెలుగు, హిందీతో పాటు తమిళంలో కూడా తన ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది మృణాల్. కాకపోతే అమ్మడికి అక్కడ నుంచి ఛాన్స్ లు రావట్లేదు. తెలుగులో మాత్రం మృణాల్ ఎలాంటి సినిమా అయినా చేసి తీరుతా అని కాన్ఫిడెంట్ గా చెబుతుంది.
