డెకాయిట్ మృణాల్.. జూలియట్ లుక్ లో పవర్ఫుల్ ఏమోషన్!
టాలీవుడ్‌లో మరోసారి ఓ కొత్త కథ, కొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అడివి శేష్.
By: M Prashanth | 31 July 2025 11:14 PM ISTటాలీవుడ్‌లో మరోసారి ఓ కొత్త కథ, కొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అడివి శేష్. ఆయన నటిస్తున్న తాజా సినిమా డెకాయిట్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి యువ దర్శకుడు షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మాణ సంస్థల ద్వారా వస్తున్న ఈ సినిమా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో చక్కటి బజ్ తీసుకొచ్చింది.
ఇక లేటెస్ట్ గా, మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్పెషల్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. పోస్టర్‌లో మృణాల్ కళ్లల్లో కనిపించే భావోద్వేగం, చేతిలో తుపాకీ పట్టుకుని ఉండడం… ఆమె పాత్రలోని బలాన్ని, వేదనను హైలైట్ చేస్తోంది. మృణాల్ తలపై గాయం, కళ్లు చెమ్మగిలి ఉండటం చూస్తే… ఆమె పాత్రలో కష్టమైన ప్రయాణం ఉన్నట్లు తెలుస్తోంది. జూలియట్ కేవలం లవ్ ఇంటరెస్ట్ పాత్ర కాదు… డెకాయిట్ కథలో అసలైన ఏమోషన్ అని అర్ధమవుతుంది.
ఈ సినిమాలో మృణాల్ పాత్ర చాలా ప్రత్యేకమైనదని మేకర్స్ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ప్రేమ, బాధ, ప్రతీకారం మధ్య అల్లుకున్న కథలో ఆమె పాత్రకే భావోద్వేగానికి నిలయంగా ఉంటుందట. గతంలో ఆమె చేసిన పాత్రలకు భిన్నంగా, ఈ సారి మరింత స్ట్రాంగ్ కంటెంట్, స్ట్రాంగ్ లేయర్ ఉన్న క్యారెక్టర్‌గా కనిపించనున్నారు. అడివి శేష్ మృణాల్ జోడి, ప్రేక్షకులకు మరోసారి కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని అంటున్నారు సినీ వర్గాలు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. కథానాయకుడు అడివి శేష్, కథానాయిక మృణాల్ పాల్గొంటున్న ఈ సీన్స్ సినిమాలో భావోద్వేగ పరంగా కీలకమవుతాయని యూనిట్ చెబుతోంది. డెకాయిట్ కి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెంటేషన్ అదనపు బలం.
ఇక క్రిస్మస్ 2025 సందర్భంగా, డిసెంబర్ 25న డెకాయిట్ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సినిమా కథ, స్టార్ కాస్ట్, విజువల్స్ అన్నీ కలిసి ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ప్రామిసింగ్ దర్శకుడు, స్టార్ హిరోలు హిరోయిన్ల కాంబో, మ్యూజిక్ అన్నీ కలిసి డాకోయిట్‌ని టాలీవుడ్‌లో మరో విశిష్టమైన సినిమా చేయనున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ ఈ సారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
