Begin typing your search above and press return to search.

మృణాల్ కామెంట్స్.. తెలుగు ఆడియన్స్ హ్యాపీ..!

టాలీవుడ్ లో ఛాన్స్ లు అందుకుని ఇక్కడ క్రేజ్ తో నేషనల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్న భామలంతా కూడా తెలుగు సినిమాల వల్ల తమకు జరిగిన మేలు మర్చిపోతుంటారు.

By:  Ramesh Boddu   |   30 Dec 2025 4:00 PM IST
మృణాల్ కామెంట్స్.. తెలుగు ఆడియన్స్ హ్యాపీ..!
X

టాలీవుడ్ లో ఛాన్స్ లు అందుకుని ఇక్కడ క్రేజ్ తో నేషనల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్న భామలంతా కూడా తెలుగు సినిమాల వల్ల తమకు జరిగిన మేలు మర్చిపోతుంటారు. తనలో టాలెంట్ ఉంది కాబట్టే వాళ్లు ఛాన్స్ ఇచ్చారంటూ కొందరు కాస్త అతి చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ టాలీవుడ్ వల్ల తన కెరీర్ టర్న్ తీసుకుందని చెబుతూ తెలుగు పరిశ్రమ మీద తన ప్రేమను చూపించింది మృణాల్ ఠాకూర్. హిందీలో సీరియల్స్ చేసి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంది మృణాల్ ఠాకూర్.

తెలుగులో సీతారామం సినిమాతో..

ఐతే తెలుగులో సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడికి ఇక్కడ మంచి పాపులారిటీ వచ్చింది. బాలీవుడ్ లో తనతో లవ్ స్టోరీస్ తీయలేదు తనని కేవలం గ్లామర్ గానే చూపించారని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మృణాల్ ఠాకూర్ మరోసారి తెలుగు పరిశ్రమ మీద తన అభిమానాన్ని చెప్పింది. తెలుగు సినిమాల వల్లే తనకు గుర్తింపు వచ్చిందని వాటి వల్లే తన కెరీర్ మారిపోయిందని అంటుంది. బాలీవుడ్ మేకర్స్ ఏమైనా అనుకుంటారన్న డౌట్ లు ఏమి లేకుండా టాలీవుడ్ మీద మృణాల్ చూపిస్తున్న ఈ ప్రేమకు తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు.

ఎంతోమంది ముంబై భామలు తెలుగులో స్టార్ క్రేజ్ వచ్చినా కూడా తెలుగు సినిమాలను, టాలీవుడ్ ని చిన్నచూపు చూసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ల కెరీర్ లో హిట్ సినిమాలు తెలుగులో ఉన్నా కూడా వాటిని వదిలేసి మిగతా భాషల్లో యావరేజ్ సినిమాల గురించి డిస్కషన్స్ పెట్టే వాళ్లు ఉన్నారు. కానీ వాళ్లందరికీ షాక్ ఇస్తూ మృణాల్ తెలుగు పరిశ్రమ మీద చేస్తున్న కామెంట్స్ తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి.

డెకాయిట్ మృణాల్ ఠాకూర్ ఖాతాలో సూపర్ హిట్ పడేలా..

తెలుగులో సీతారామం, హాయ్ నాన్న తో హిట్ అందుకున్న మృణాల్ నెక్స్ట్ వచ్చిన ఫ్యామిలీ స్టార్ తో నిరాశపరచింది. ప్రస్తుతం అడివి శేష్ డెకాయిట్ తో మార్చిలో రాబోతుంది అమ్మడు. ఈమధ్యనే రిలీజైన డెకాయిట్ టీజర్ చూస్తే కచ్చితంగా మృణాల్ ఠాకూర్ ఖాతాలో సూపర్ హిట్ పడేలా ఉంది.

డెకాయిట్ తర్వాత కూడా రీసెంట్ గానే రెండు స్టోరీస్ దాదాపు ఓకే అయినట్టు తెలుస్తుంది. కథల ఎంపికలో మృణాల్ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఐతే బాలీవుడ్ లో ఆమె ఇప్పటికీ ఒక మంచి లవ్ స్టోరీ కోసం ఎదురుచూస్తుండటం విశేషం. అక్కడ ఎందుకో మృణాల్ కి సరైన పాత్రలు రావట్లేదు. తెలుగులో ఆమె ప్రతిభ గుర్తించి స్టార్ ఛాన్స్ లు ఇస్తుండగా బాలీవుడ్ లో మాత్రం ఆమెను ఒక గ్లామర్ హీరోయిన్ గానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందుకే మృణాల్ కూడా తెలుగు సినిమాల మీదే ఆసక్తి చూపిస్తుంది. రీసెంట్ గా మృణాల్ కి తమిళ పరిశ్రమ నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.