చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న మృణాల్..
చాలా రోజుల తర్వాత ఇలా చీర కట్టులో కనిపించి తన అందాలను హైలెట్ చేయడమే కాకుండా అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది మృణాల్ ఠాకూర్.
By: Madhu Reddy | 2 Dec 2025 11:49 AM ISTమృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ అభిమానులకు చేరువవుతున్న ఈమె.. రోజుకొక ఫోటోషూట్ పంచుకుంటూ ఫాలోవర్స్ ను కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చీరకట్టులో అభిమానులను మెస్మరైజ్ చేయడానికి వచ్చేసింది మృణాల్ ఠాకూర్. మేతి కలర్ చీర కట్టుకొని అందుకు కాంబినేషన్లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన ఈమె.. తన అందాలతో మరొకసారి ఆకట్టుకుంది. చీరకు తగ్గట్టుగా జువెలరీని మ్యాచ్ చేస్తూ ధరించిన ఈమె.. తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుని అందంతో కట్టిపడేస్తోంది.
చాలా రోజుల తర్వాత ఇలా చీర కట్టులో కనిపించి తన అందాలను హైలెట్ చేయడమే కాకుండా అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది మృణాల్ ఠాకూర్. మొత్తానికైతే ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా అభిమానులు పలు రకాల హార్ట్ ఎమోజీలను, ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.
ప్రముఖ సినీ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందు 2012లో 'ముజ్సే కుచ్ కెహెతి.. ఏ ఖామోషియాన్' అనే హిందీ సీరియల్ ద్వారా తన నటన జీవితాన్ని మొదలుపెట్టింది. 2014లో వచ్చిన విట్టి దండు అనే మరాఠీ చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన మృణాల్.. మరాఠీ చిత్రం తోపాటు హిందీ, తెలుగు చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తొలిసారి హీరోగా లీడ్రోల్ పోషిస్తూ తెరకెక్కించిన ఫుల్ లెంగ్త్ చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారా మృణాల్ తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమా అయినా ఇందులో సీత పాత్రలో చాలా అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. చీరకట్టులో సాంప్రదాయంగా కనిపించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' అనే సినిమాలో జ్యోత్స్న క్యారెక్టర్ లో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక అదే జోష్ తో హ్యాట్రిక్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. అలా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలా ఈ సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకుంది.
ఇకపోతే అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ కి పరిమితమవుతుందని అనుకుంటున్న సమయంలో.. సడన్గా అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. వాస్తవానికి ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కొన్ని సన్నివేశాలు కూడా పూర్తి చేశారు. కానీ శృతిహాసన్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆస్థానంలో మృణాల్ ను తీసుకోవడం జరిగింది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా అయినా మృణాల్ కు మంచి సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.
