అందాలతో ఆకట్టుకుంటున్న మృణాల్ ఠాకూర్!
సౌత్ నుంచి నార్త్ వరకు చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ.. ఫాలోవర్స్ లో పెంచుకుంటున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 29 Oct 2025 11:30 AM ISTసౌత్ నుంచి నార్త్ వరకు చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ.. ఫాలోవర్స్ లో పెంచుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్లామర్ ఫోటోలు మాత్రమే కాకుండా సినిమాలకు సంబంధించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఇకపోతే అలా కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఇటు గ్లామర్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న ఈమె.. తాజాగా చీర కట్టులో కనిపించి సాంప్రదాయంగా అభిమానులను అలరించింది.
గోల్డెన్ కలర్ ప్లేన్ టస్సర్ సిల్క్.. హెవీ అన్కట్ బార్డర్ కలిగిన చీర ధరించిన ఈమె దీనికి ఆపోజిట్ హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించింది. అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్ తో అందంగా డిజైన్ చేసిన చౌకర్ ను ధరించి జుట్టును అలా గాలికి వదిలేసి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా పలు రకాల లవ్, ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ ఆమెపై తమ ప్రేమను కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈమె ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అడవి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది.. నిజానికి ఈ పాత్రలో శృతిహాసన్ ఎంపికైంది. కొంత భాగం షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. కానీ శృతిహాసన్ కి చిత్ర బృందంతో విభేదాలు ఏర్పడ్డాయని.. అందుకే ఆమె తప్పుకోవడం తో ఆమె స్థానంలో మృణాల్ ను తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అడవి శేషు స్పందిస్తూ.. శృతిహాసన్ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాకు ఎక్కువ రోజులు కేటాయించలేకపోతు ఇబ్బంది పడుతున్నారు అందుకే ఆమె తప్పుకోవడం తోనే మృణాల్ ను తీసుకున్నామని ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు.
ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా మృణాల్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. మృణాల్ తెలుగు చిత్రాల విషయానికొస్తే.. సీతారామం సినిమాతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకుంది. అలాగే 'హాయ్ నాన్న' అంటూ నాని సరసన నటించి ఇందులోని తన పాత్రతో అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ది ఫ్యామిలీ స్టార్ అంటూ విజయ్ దేవరకొండతో సినిమా చేసింది కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. దాంతో హ్యాట్రిక్ హిట్టు అందుకోకుండానే డిజాస్టర్ చవి చూసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇప్పుడు డెకాయిట్ సినిమా ఈమెకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
