వెరైటీ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న మృణాల్!
సినీ సెలబ్రిటీలు నిత్యం అందంతో, గ్లామర్ తో ఆకట్టుకోవడమే కాకుండా ట్రెండీ అవుట్ ఫిట్ తో కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
By: Madhu Reddy | 2 Feb 2026 10:52 AM ISTసినీ సెలబ్రిటీలు నిత్యం అందంతో, గ్లామర్ తో ఆకట్టుకోవడమే కాకుండా ట్రెండీ అవుట్ ఫిట్ తో కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వెరైటీ డ్రెస్సులతో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తున్నారు. భిన్న విభిన్నమైన వస్త్రధారణలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అటు ఫాలోవర్స్ గా మార్చుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. తాజాగా ఆరెంజ్ కలర్ అవుట్ ఫిట్ ధరించిన ఈమె ఇది కాస్త వెరైటీగా ఉండడంతో దీనికి ఆమె క్యాప్షన్ కూడా జోడించింది. ఇది వెరైటీ డ్రెస్ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. మొత్తానికి అయితే తన వెరైటీ డ్రెస్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇకపోతే ఫ్యాషన్ ప్రియులను ఈ డ్రెస్ బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.
వెరైటీ ఇండియా డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్ మృణాల్ అందాన్ని రెట్టింపు చేసింది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ధరించిన ఈ ఔట్ఫిట్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇది చూసిన అభిమానులు ఫ్యాషన్ సెన్స్ కి కేరాఫ్ అడ్రస్ అంటూ కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది మృణాల్ ఎప్పటికప్పుడు తన అందంతో అలరిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు..
హిందీ సీరియల్ ద్వారా 2012లోనే నటన రంగ ప్రవేశం చేసిన మృణాల్ ఠాగూర్ 2014లో మరాఠీ సినిమా ద్వారా నటిగా సినీ రంగంలోకి ప్రవేశించింది. ఈ సినిమా తర్వాత మరాఠీతో పాటు హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా చేసి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో సీత క్యారెక్టర్ లో కట్టు బొట్టుతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఈమెను సొంతింటి ఆడపడుచులా ఓన్ చేసుకున్నారు అనడంలో సందేహం లేదు.
లవ్ సోనియా , బట్ల హౌస్, ఘోస్ట్ స్టోరీస్, తుఫాన్, ధమాకా, జెర్సీ వంటి హిందీ చిత్రాలలో నటించిన ఈమె.. తెలుగులో సీతారామం సినిమా తర్వాత హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. వాస్తవానికి ఇందులో మొదటి శృతిహాసన్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. కానీ కొంత షూటింగ్ పూర్తి అయ్యాక చిత్ర బృందంతో విభేదాలు ఏర్పడడం వల్లే ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మృణాల్ ఠాగూర్ ను పరిచయం చేస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానంది.
అలా ఒకవైపు తెలుగు చిత్రాలలో అవకాశం అందుకుంటున్న ఈమె మరొకవైపు హిందీలో కూడా బిజీగా మారినట్లు సమాచారం. ఇంకొక వైపు ఇలా సోషల్ మీడియా వేదికగా ట్రెండీ ఔట్ ఫిట్ తో ప్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.
