బ్లాక్ అవుట్ ఫిట్ లో మరింత అందంగా!
ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానులను, ఫాలోవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి .
By: Madhu Reddy | 3 Oct 2025 10:00 PM ISTమృణాల్ ఠాకూర్.. ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పూర్తి స్థాయి తొలి తెలుగు చిత్రం 'సీతారామం'. ఈ సినిమా కంటే ముందు మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా వచ్చిన 'మహానటి' సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర పోషించిన ఈయన.. ఆ తర్వాత సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులను పలకరించింది మృణాల్ ఠాకూర్. ఇందులో సాంప్రదాయంగా చీరకట్టులో కనిపించి, సీత పాత్రతో అందరి హృదయాలను దోచుకుంది. ఇందులో ఆమె చీరకట్టు బొట్టు అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఈమెను సొంత అమ్మాయిగా ఓన్ చేసేసుకున్నారు.
అంతేకాదు పలు చిత్రాలలో అవకాశాలు ఇవ్వాలని అభిమానులు కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.అలా సీతారామం విజయం సాధించడంతో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' సినిమాలో జోష్ణ పాత్రతో మరొకసారి పలకరించింది. ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి 'ది ఫ్యామిలీ స్టార్' సినిమా చేసింది. కానీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇప్పుడు అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమా నుండి శృతిహాసన్ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసిన మృణాల్ త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానులను, ఫాలోవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి . అందులో బ్లాక్ ఔట్ఫిట్ లో కనిపించిన ఈమె తన అందంతో అబ్బురపరిచింది. విషయంలోకి వెళ్తే.. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) లో జరిగిన బ్వ్లగారి సెర్పెంటి ఇన్ఫినిటీ ఎగ్జిబిషన్ కి టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా చాలామంది నటీమణులు తమ ఫ్యాషన్స్ సెన్స్ తో సందడి చేశారు. అందులో భాగంగానే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా హాజరయ్యింది.ఇందులో మృణాల్ ఠాకూర్ ఎగ్జిబిషన్లో లీనమై ఆర్ట్ ఇన్స్టాలేషన్ మధ్య అద్భుతమైన నల్లటి ఔట్ఫిట్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది.
అంతేకాదు బ్వ్లగారి సెర్పెంటి ఇన్ఫినిటీ ఎగ్జిబిషన్ లో అత్యంత చారిత్రాత్మక , ఆధునిక భారతీయ కళలతో పాటు బ్వ్లగారి ఐకానిక్ సర్పెంటి సేకరణను ప్రదర్శించారు . సమకాలీన కళాఖండాల మిశ్రమం, బ్వ్లగారి వారసత్వ వస్తువులు, ఉన్నత స్థాయి ఆభరణాలు ఇందులో ప్రదర్శించారు. ఇప్పటికే షాంఘై, సియోల్ లలో విజయవంతమైన ప్రదర్శనలు తర్వాత ముంబైలో ఈ ప్రదర్శన నిర్వహించడం గమనార్హం. అంతేకాదు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్న మూడవ నగరంగా ముంబై నిలిచింది.
ఈ ఈవెంట్ లో సందడి చేసిన మృణాల్ ఠాకూర్ బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనం ఇవ్వడమే కాకుండా బ్వ్లగారి వారసత్వ ఆభరణాలను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆ ఫోటోలనే ఆమె ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
