స్టన్నింగ్ లుక్ లో మృణాల్..
టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్ గా అతి తక్కువ సమయంలోనే స్టార్డం సంపాదించుకున్న వారిలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు.
By: Madhu Reddy | 27 Dec 2025 1:27 PM ISTటాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్ గా అతి తక్కువ సమయంలోనే స్టార్డం సంపాదించుకున్న వారిలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. అందం, అభినయంతో పాటు అదిరిపోయే ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. 2013లో మొదటిసారి హిందీ సీరియల్ ద్వారా కెరీర్ ను ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత 2014లో హలో నందన్ అనే మరాఠీ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలా హిందీ , మరాఠీ అంటూ ఎన్నో చిత్రాలలో నటించినా కూడా పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ ఎప్పుడైతే తెలుగులో సీతారామం అనే చిత్రంలో నటించిందో.. అప్పుడే ఊహించని క్రేజ్ లభించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి వారసుడు ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో నటించిన చిత్రం ఇది. ఇటు ఇద్దరికీ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.
ఈ సినిమా తర్వాత హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కావడంతో అవకాశాలు తలుపు తట్టలేదు. కానీ ఇప్పుడు అడవి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉండగా మరోవైపు నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
కొన్నిసార్లు తన అందాలతో బ్లాస్ట్ చేయడమే కాకుండా మరికొన్నిసార్లు ఆశ్చర్యపరిచేలా ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లైఫ్ స్టైల్ ఇండియా కవర్ పేజ్ కోసం ఫోటోలకు ఫోజులిచ్చింది ఆ ఫోటోలను తాజాగా తన ఇంస్టాగ్రామ్ లేదు కదా పంచుకుంది. ఈ ఫోటోలలో మృణాల్ ఠాకూర్ చాలా స్టైలిష్ లుక్కులో కనిపించడమే కాకుండా తన డ్రెస్సింగ్ స్టైల్ తో కూడా అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఫుల్ స్లీవ్ బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో గ్రీన్ అండ్ వైట్ బ్లాక్ చెక్స్ తో డిజైన్ చేసిన షార్ట్ ధరించింది. బ్లాక్ కలర్ చైర్ వద్ద స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అలా స్టన్నింగ్ లుక్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన అందాలతో మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసింది.
మృణాల్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. అడవి శేషుతో డెకాయిట్ చిత్రంలో , కార్తీ నటిస్తున్న సన్నాఫ్ సర్దార్ 2 , అల్లు అర్జున్ 22వ చిత్రంలో కూడా నటిస్తోంది. వీటితోపాటు మరో రెండు , మూడు హిందీ చిత్రాలలో కూడా నటిస్తోంది మృణాల్ ఠాకూర్. ఏది ఏమైనా ఈమధ్య భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఇంకొక వైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
