ఫ్లోరల్ వైబ్స్‌లో మృణాళ్ ఠాకూర్.. క్లాసీ లుక్ అదుర్స్!
ఈ లగ్జరీ అవుట్‌ఫిట్‌కు జతగా 'ఆక్వాజురా' బ్రాండ్ హై హీల్స్, 'బ్లూమ్' నుంచి ప్రత్యేకమైన సీషెల్ చార్మ్ నెక్లేస్ ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపించింది.
By: Madhu Reddy | 12 Sept 2026 4:00 AM ISTటాలీవుడ్ లో 'సీతారామం' లో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాళ్ ఠాకూర్, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. జిమ్మెర్‌మాన్ డిజైనర్ ఫ్లోరల్ డ్రెస్‌లో దేవకన్యలా మెరిసిపోతూ ఆమె ఇచ్చిన పోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిరునవ్వుతో, చందమామలాంటి అందంతో మెరిసిపోతున్న మృణాళ్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయిన ఈ పిక్స్ ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..
జిమ్మెర్‌మాన్ మ్యాక్సీ డ్రెస్‌లో రాయల్ లుక్ :
తాజా ఫోటోషూట్ కోసం మృణాళ్ ఠాకూర్ 'జిమ్మెర్‌మాన్' బ్రాండ్‌కు చెందిన 'డేలైట్ టైర్డ్ మ్యాక్సీ డ్రెస్'ను ఎంచుకుంది. ఫ్లోరల్ డిజైన్, నూడుల్ స్ట్రాప్స్, లేస్ అప్ ఫిట్టెడ్ బోడిస్‌తో ఉన్న ఈ మల్టీ లేయర్డ్ అవుట్‌ఫిట్ ఆమెకు రాయల్ అండ్ రోమాంటిక్ వైబ్‌ను తెచ్చిపెట్టింది. ఇక మూడు వరుసల ప్లీటెడ్ టైర్స్, ఎంబ్రాయిడరీ లేస్ ట్రిమ్స్ ఈ డ్రెస్సింగ్‌కు మరింత గ్రాండ్ లుక్‌ని ఇచ్చాయి.
స్టైలిష్ యాక్సెసరీస్ అండ్ డ్రీమీ క్యాప్షన్:
ఈ లగ్జరీ అవుట్‌ఫిట్‌కు జతగా 'ఆక్వాజురా' బ్రాండ్ హై హీల్స్, 'బ్లూమ్' నుంచి ప్రత్యేకమైన సీషెల్ చార్మ్ నెక్లేస్ ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపించింది. వదులైన అలల జుట్టు, సహజమైన గ్లోయింగ్ మేకప్‌తో వెలుతురులో మెరిసిపోతున్న పిక్స్‌ను షేర్ చేస్తూ "డ్రెస్ తిప్పుతూ.. హృదయం నవ్వుతూ.. సంతోషం అంటే ఇదేనేమో!" అంటూ లవ్లీ క్యాప్షన్ ఇచ్చింది.
ఫ్యాన్స్ ఫిదా.. కామెంట్ల వర్షం :
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు కామెంట్ల రూపంలో మృణాళ్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. "సూపర్ లుక్", "నీ అందమైన నవ్వు నీ పర్సనాలిటీని మరింత పర్‌ఫెక్ట్‌గా మార్చింది" అంటూ కామెంట్ బాక్స్‌ను నింపేస్తున్నారు. సాఫ్ట్ గర్ల్ ఎరా వైబ్స్‌తో ఉన్న ఈ పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
'సీతారామం' నుంచి 'డెకాయిట్' వరకు కెరీర్ :
'సీతారామం'తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మృణాళ్, ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. రీసెంట్‌గా 'డెకాయిట్' సినిమాతో అలరించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక హిందీతో పాటు తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతూ తన కెరీర్‌ను విభిన్నంగా ప్లాన్ చేసుకుంటోంది. తన నేచురల్ యాక్టింగ్, క్లాసీ ఫ్యాషన్ సెన్స్‌తో ప్రతీ ఫోటోషూట్‌లోనూ మ్యాజిక్ చేస్తున్న మృణాళ్ ఠాకూర్, రాబోయే రోజుల్లో అన్ని భాషల్లోనూ మరిన్ని బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
